లక్ష్మీమీనన్‌ రీఎంట్రీ షురూ?

15 Mar, 2020 08:56 IST|Sakshi

లక్ష్మీమీనన్‌ రీఎంట్రీ షురూ అయ్యిందన్నది తాజా సమాచారం. కుంకీ చిత్రంతో కోలీవుడ్‌కు పరచయమైన కేరళా కుట్టి లక్ష్మీమీనన్‌. తొలి చిత్రంతోనే నటిగా మంచి గుర్తింపును తెచ్చుకున్న ఈ అమ్మడు ఆ తరువాత వరుసగా అవకాశాలను రాబట్టుకుంది. కుట్టిపులి, పాండినాడు, కొంబన్‌ నాన్‌ సిగప్పు మణిదన్‌ వంటి పలు విజయవంతమైన చిత్రాల్లో నటించింది. అంతేకాదు పక్కింటిఅమ్మాయి ఇమేజ్‌ను సంపాదించుకున్న లక్ష్మీమీనన్‌ నటిగా మంచి ఫామ్‌లో ఉండగా చదువు, పరీక్షలు అంటూ నటనకు గ్యాప్‌ ఇచ్చింది. ఇది తన కెరీర్‌లో చేసిన పెద్ద పొరపాటు అని చెప్పక తప్పుదు. ఆ తరువాత ప్లస్‌టూ పరీక్షల్లో ఉత్తీర్ణత పొందాను. మళ్లీ నటిస్తాను అని చెప్పినా అవకాశాలు ముఖం చాటేశాయి. చదవండి: కరోనా ఎఫెక్ట్‌: నిఖిల్‌ వివాహం రద్దయ్యే ఛాన్స్‌

ఆ తరువాత విజయ్‌సేతుపతికి జంటగా రెక్క అనే చిత్రంలో నటించింది. ఆ చిత్రం నిరాశపరచడంతో పాటు, అందులో అమ్మడు బాగా లావెక్కిందనే విమర్శలను మూటగట్టుకుంది. జయంరవితో మిరుదన్‌ చిత్రంలో నటించింది. ఆ చిత్రం 2016లో విడుదలైంది. అంతే ఆ తరువాత అక్ష్మీమీనన్‌ను తమిళ తెరపై చూడలేదు. కాగా ఆ మధ్య ప్రభుదేవాతో యంగ్‌ మంగ్‌ సంగ్‌ అనే చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. అయితే ఆ చిత్ర నిర్మాణం ఏ స్థాయిలో ఉందనేది తెలియలేదు. కాగా చాలాకాలానికి అంటూ నాలుగేళ్ల తరువాత తాజాగా లక్ష్మీమీనన్‌ ఒక అవకాశాన్ని అందుకుంది.

ఆమెకు కుట్టిపులి, కొంబన్‌ చిత్రాలతో సక్సెస్‌ను అందించిన దర్శకుడు ముత్తయ్యనే ఇప్పుడు రీఎంట్రీ కల్పిస్తున్నారు. ఈ దర్శకుడు తాజాగా నటుడు గౌతమ్‌ కార్తీక్‌ హీరోగా చిత్రం చేయనున్నారు. అందులో నటి లక్ష్మీమీనన్‌ను హీరోయిన్‌గా ఎంపిక చేసినట్లు సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది. కాగా దర్శకుడు ముత్తయ్య ఇంతకుముందు గౌతమ్‌ కార్తీక్‌ హీరోగా దేవరాట్టం చిత్రాన్ని తెరకెక్కించారన్నది గమనార్హం. అదేవిధంగా  గౌతమ్‌మీనన్, లక్ష్మీమీనన్‌ జంటగా ఇంతకుముందు సిపాయ్‌ చిత్రంలో నటించారు. ఈ చిత్రం ఇంకా విడుదల కాలేదన్నది గమనార్హం. అన్నట్టు ఆ మధ్య  బొద్దుగా బరువెక్కిన నటి లక్ష్మీమీనన్‌ ఇప్పుడు చాలా స్లిమ్‌గా తయారైంది.  చదవండి: 'నా పార్టీ జెండా ఇంద్రధనుస్సు గుర్తు జామకాయ' 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు