‘ఇండియన్‌-2 తాత’ గెటప్‌ అదిరింది!

1 Dec, 2018 20:37 IST|Sakshi

తమిళసినిమా: గెటప్‌లు వేయడంలో కమల్‌ హాసన్‌ తరువాతే ఎవరైనా.. దశావతారంలో ఆయన పది గెటప్‌లతో ఏ పాత్రకు ఆ పాత్ర వినూత్నంగా పోషించి.. అలరించారు. ఇక భారతీయుడు చిత్రంలో కమల్‌ పోషించిన రెండు పాత్రలు గెటప్‌పరంగా అద్భుతమే. 22 ఏళ్ల తరువాత ఇప్పుడు మరోసారి ఆయన భారతీయుడి అవతారం ఎత్తబోతున్నారు. కమలహాసన్, శంకర్‌ కాంబినేషన్‌లో ‘ఇండియన్‌-2’కు ముహూర్తం కుదిరిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఫ్రీ ప్రొడక‌్షన్‌ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఈ నెల14న పూజా కార్యక్రమాలతో చెన్నైలో ఈ చిత్ర షూటింగ్‌ ప్రారంభం కానుందని సమాచారం.

ప్రభుత్వాధికారుల అవినీతి, లంచగొండితనం ప్రధాన అంశాలుగా తెరకెక్కిన భారతీయుడు సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇక, రెండో భాగంలో రాజకీయ నాయకుల అవినీతి నేపథ్యంగా తెరకెక్కనుందని సమాచారం. నిజజీవితంలో కమలహాసన్‌ రాజకీయాల్లోకి ప్రవేశించి ముఖ్యమంత్రి పదవే లక్ష్యంగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో ఇండియన్‌-2 ఆయన రాజకీయ జీవితానికి ఉపయోగపడేలా ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రంలో కమల్‌ గెటప్‌ కోసం హాలీవుడ్‌ నిపుణులను రప్పించి పలు రకాల గెటప్‌లతో ఫొటోషూట్‌ చేశారు. అందులో తాత కోసం రూపొందించిన గెటప్‌ అదిరిపోయిందట. ఈ గెటప్‌ చిత్ర యూనిట్‌నే అబ్బురపరిచిందట.

ఇక, ఈ సినిమాలో కమల్‌ సరసన కాజల్‌ నటించనున్న సంగతి తెలిసిందే. కమల్‌-శంకర్‌ కాంబినేషన్‌లో నటించే అవకాశం​ రావడంపై కాజల్‌ ఆనందం వ్యక్తం చేస్తోంది. తర్వలోనే కాజల్‌ గెటప్‌ కోసం శంకర్‌ ఫొటోషూట్‌ నిర్వహించనున్నారు. 2.ఓ చిత్రం తరువాత శంకర్‌ చేస్తున్న చిత్రం కావడంతో ఇండియన్‌ 2 కూడా బ్రహ్మాండంగా తెరకెక్కించబోతున్నట్లు సమాచారం.

మరిన్ని వార్తలు