నా బ్రాండ్‌ రెడ్‌ట్రీ 

24 Jun, 2020 01:24 IST|Sakshi

ట్రెండ్‌కు తగ్గట్టు పని చేస్తే ట్రెండింగ్‌లో ఉంటారు, ట్రెండ్‌కు తగ్గట్టు ఉంటారు. దాన్ని అక్షరాలా నిజం చేస్తూ కరోనా టైమ్‌లో రెడ్‌ట్రీ అనే బ్రాండ్‌తో మాస్క్‌లను తయారు చేస్తున్నారు ప్రముఖ హీరోయిన్‌ లావణ్యా త్రిపాఠి. సోషల్‌ మీడియాలో ఈ విషయం గురించి లావణ్యా మాట్లాడుతూ –‘‘మాస్క్‌లు తయారు చేయాలనుకోవడం వెనక నాకెలాంటి లాభాపేక్ష లేదు. హైదరాబాద్‌కు చెందిన ఫ్యాషన్‌ డిజైనర్‌ అనితారెడ్డి సహకారంతో మాస్క్‌లను రెడీ చేశాం. లాక్‌డౌన్‌ టైమ్‌లో మా టైలర్స్‌కి, మాస్టర్స్‌కి పెయిడ్‌ హాలిడేస్‌ ఇచ్చాం. పనిలేక బోర్‌ కొడుతోంది, ఏదైనా పని చెప్పండి అన్నారు. అందుకని బాగా ఆలోచించి ఖాళీగా ఉండటం ఎందుకు, మంచి క్వాలిటీతో మాస్క్‌లు చేయండని చెప్పాను. అలా తయారు చేసిన మాస్క్‌లను ఇండస్ట్రీలోని అందరికీ ఇవ్వాలనుకున్నాం. అందుకే ‘రెడ్‌ట్రీ’ బ్రాండ్‌ స్టార్ట్‌ చేశాను. మాస్క్‌లు బావున్నాయని అందరూ అన్నారు. భవిష్యత్తులో నేను, అనిత ఈ బ్రాండ్‌పై అనేక ఉత్పత్తులు తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నాం’’ అన్నారు. 

మరిన్ని వార్తలు