మరో ప్రయోగం చేస్తున్న లారెన్స్

2 Jan, 2016 13:49 IST|Sakshi
మరో ప్రయోగం చేస్తున్న లారెన్స్

కొరియోగ్రాఫర్గా ఎంట్రీ ఇచ్చి తరువాత దర్శకుడిగా హీరోగా కూడా సూపర్ సక్సస్ అయిన సౌత్ సెలబ్రిటీ లారెన్స్. కొరియోగ్రాఫర్గా కెరీర్ మంచి ఫాంలో ఉండగానే డైరెక్టర్గా టర్న్ తీసుకున్న లారెన్స్, నాగార్జున లాంటి స్టార్ హీరోలతో సినిమాలు చేసి మంచి విజయాలు సాధించాడు. ఆ తరువాత తానే హీరోగా మారి స్టైల్ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు. సౌత్ ఇండస్ట్రీలో చాలా కాలం క్రితం వచ్చిన హార్రర్ కామెడీ జానర్ సినిమాలను కాంచనతో మళ్లీ తెర మీదకు తీసుకువచ్చి వరుసగా మూడు బ్లాక్ బస్టర్లను సాధించాడు.

అదే జోష్లో ఇప్పుడు మరో ప్రయోగానికి రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం మొట్ట శివ, కొట్టే శివ పేరుతో కాంచన సీరీస్లో మరో సినిమాను తెరకెక్కిస్తున్న లారెన్స్, ఆ సినిమా పూర్తయిన తరువాత రెండు డిఫరెంట్ సినిమాలను ప్రారంభించనున్నాడు. నాగ, భైరవ పేరుతో తెరకెక్కనున్న ఈ రెండు సినిమాల్లో జంతువులే ప్రధాన పాత్రల్లో కనిపించనున్నాయట. 80లలో సౌత్ ఇండస్ట్రీలో ఇలాంటి సినిమాలు కనిపించినా.. తరువాత తరువాత తగ్గిపోయాయి. ప్రస్తుతం జంతువుల రక్షణ కోసం అనేక సంఘాలు పని చేస్తున్న సమయంలో లారెన్స్ చేయాలనుకుంటున్న సినిమాలకు అడ్డంకులు ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది. మరి లారెన్స్ జంతువులతోనే ఈ సినిమా తెరకెక్కిస్తాడా లేక పూర్తిగా గ్రాఫిక్స్ మీదే ఆధారపడతాడా చూడాలి.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
సినిమా