కాస్టింగ్‌ కౌచ్‌పై స్పందించమని అడుగుతున్నారు

23 Apr, 2018 21:42 IST|Sakshi
టాలీవుడ్‌ సినీ హీరో మంచు మనోజ్‌(పాత చిత్రం)

హైదరాబాద్‌ :  టాలీవుడ్‌లో ప్రస్తుత పరిస్థితిపై సామాజిక మాధ్యమాల ద్వారా కాస్టింగ్‌ కౌచ్‌పై స్పందించమని తనను చాలా మంది అడుగుతున్నారని సినీ హీరో మంచు మనోజ్‌ తెలిపారు. ప్రస్తుత పరిణామాలపై లేఖ సంధించారు. టాలీవుడ్‌లో వివాదాలకు, ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలకు దూరంగా ఉంటున్నానని కూడా కొంతమంది అంటున్నారని చెప్పారు. కానీ తాను అలాంటి వాడిని కానని చెప్పారు. ప్రతి పరిశ్రమలోనూ మహిళలు లైంగిక వేధింపులకు గురువుతున్నారని, ఏడు భయంకరమైన పాపాల్లో కామము ఒకటని, అది ప్రతి పరిశ్రమలోనూ  ఉందన్నారు. ఈ సమస్యను పారద్రోలాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందన్నారు.

సినీ పరిశ్రమలో మహిళలపై లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా పోరాడుదామని పవన్‌ కల్యాన్‌ అన్న ట్వీట్‌ చేసిన సంగతి గుర్తు చేస్తూ..తాను కూడా పవన్‌కు మద్ధతు తెలుపుతున్నట్లు తెలిపారు. మనమంతా కళామతల్లి ముద్దు బిడ్డలమన్నారు. అనవసరమైన వివాదాలకు తెరలేపకుండా అందరూ సైలెంట్‌గా  ఉండాలని కోరారు. త్వరలోనే ప్రతి విషయం సర్దుకుంటుందన్నారు. మెరిసేదంతా బంగారం కాదు..కొన్నిసార్లు చూసేదంతా నిజం కాదని చెప్పారు. ఈ పరిస్థితిని ఎలాంటి వివాదాలకు తెరలేపకుండా మీడియా సరిదిద్దగలదని భావిస్తున్నట్లు తెలిపారు. ఒక కళాకారుడిగా అభిమానులను ఎంటర్‌టైన్‌ చేయడమే తమ లక్ష్యమని వివరించారు. దాని కోసం కఠోరంగా శ్రమిస్తామని తెలిపారు. అలాగే ప్రత్యేక హోదా ఉద్యమానికి మద్ధతు తెలుపుతున్నట్లు లేఖ ద్వారా వెల్లడించారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ప్రజల్లో మార్పుతోనే కరోనా దూరం: రష్మి గౌతమ్‌

నా వంతు విరాళం సేకరిస్తున్నాను

బర్త్‌డేకి టైటిల్‌?

ఇంట్లోనే ఉందాం.... కరోనాను దేశం దాటిద్దాం

‘స్టార్‌ వార్స్‌’ నటుడు కరోనాతో మృతి

సినిమా

నా వంతు విరాళం సేకరిస్తున్నాను

బర్త్‌డేకి టైటిల్‌?

ఇంట్లోనే ఉందాం.... కరోనాను దేశం దాటిద్దాం

‘స్టార్‌ వార్స్‌’ నటుడు కరోనాతో మృతి

ఆర్జీవీ... ఓ రామబాణం

అందుకే తప్పుకున్నా