లింగా ఫజిల్

14 Feb, 2015 03:01 IST|Sakshi
లింగా ఫజిల్

లింగా చిత్రం చూడండి. దాని నిర్మాణ వ్యయం గణాంకాలతో చెప్పండి. బహుమతి పట్టండి. ఏమిటి అర్థం కాలేదా? లింగా చిత్ర డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు పాత్రికేయ మిత్రులకు ఇచ్చిన ఫజిల్. సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన చిత్రం లింగా. గత ఏడాది డిసెంబర్ 12న తెరపైకి వచ్చిన ఈ చిత్రం ఆశించిన ఫలితాన్ని పొందలేదు. బయ్యర్లు, థియేటర్ల యా జమాన్యం తీవ్ర నష్టాలకు గురయినట్లు ఆందోళనలు చేస్తున్నారు. నష్టపరిహారం చెల్లించాలంటూ నిరాహార దీక్షలు చేశారు.

కోర్టులను కూడా ఆశ్రయించారు. లింగా చిత్రం వసూళ్లు, బయ్యర్లు థియేటర్ల యాజమాన్యానికి ఏర్పడే నష్టం ఏపాటిది? అన్న విషయాలపై చిత్ర హీరో రజనీకాంత్ తన కు బాగా నమ్మకస్తుడైన డిస్ట్రిబ్యూటర్ తో విచారణ జరిపించారు. ఆ వివరాలను చిత్ర నిర్మాత రాక్‌లైన్ వెంకటేష్ కు పంపారు. ఆయన బయ్యర్లుకు, థి యేటర్ల యాజమాన్యం శుక్రవారం చెన్నైలో ఒక ప్రకటనవిడుదల చేస్తూ అందులో పాత్రికేయులకు ఒక ఫ జిల్‌ను పేర్కొన్నారు. అదే లింగా చి త్రం చూడండి. దాని నిర్మాణ వ్యయ గణాంకాలను కచ్చితంగా చెప్పండి. బ హుమతి పొందండి అంటూ ప్రకటించారు.

లింగా చిత్రం రజనీకాంత్ పారి తోషికంతో సహా రూ.45 కోట్ల బడ్జెట్‌తో రూపొందించి 157 కోట్లకు చి త్రాన్ని ఇరోస్ సంస్థకు విక్రయించిన రాక్‌లైన్ వెంకటేశ్ ఎంత లాభం పొం ది ఉంటారు. ఇందులో ర జనీకాంత్‌కు ఎంత పారితోషికం ఇచ్చి ఉంటారు అన్న విషయాలను కచ్చితంగా అంచనా వేసి చెప్పిన వారికి రూ.25 వేల బహుమతి అందించనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. విలేకరుల కోసం లింగా చిత్రా న్ని శనివారం సాయంత్రం 3.30 గం టలకు స్థానిక వడపళనిలో గల ఆర్ కెవి స్టూడియోలో ప్రదర్శించనున్నట్లు తెలిపారు. కాగా లింగా నిర్మాత చెల్లిస్తానన్న 10 శాతం నష్టపరిహారం విష యం తమకు సమ్మతం కాదని, కాబట్టి ఈ విషయమై మళ్లీ ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు డిస్ట్రిబ్యూటర్ల్లు పేర్కొన్నారు.