వారిద్దరి మధ్య ఏముంది?

29 Oct, 2019 20:50 IST|Sakshi

ముంబై: బాలీవుడ్‌ నటులు కత్రినాకైఫ్‌, విక్కీ కౌశల్‌ కలిసి ఓ స్నేహితుడు ఇచ్చిన దీపావళి పార్టీకి రావడంతో.. వారిద్దరి మధ్య ఏదో నడుస్తుందనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. పార్టీకి వీరిద్దరూ కలిసి వచ్చినా.. చివర్లో మాత్రం ఎవరికివారు యమునా తీరే అన్నట్లు ఎవరి కార్లలో వారు వెళ్లిపోయారు. అయితే వీరిద్దరూ జంటగా దీపావళి పార్టీ నుంచి బయటకు వస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. పార్టీలో విక్కీ తెలుపు రంగు కుర్తా-పైజామాతో పాటు షెర్వానీ ధరించగా.. కత్రినా రెడ్‌ కలర్‌ ఘాగ్రా - చోళిలో తళుక్కుమని మెరిశారు. కత్రినా, విక్కీ జంటగా కలిసి ఒక చిత్రంలో నటించనున్నారనే వార్తలు వస్తున్నా.. ఇప్పటివరకు ఏలాంటి అధికారిక ప్రకటన రాలేదు. గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య ప్రేమాయణం సాగుతోందనే పుకార్లు వస్తున్నప్పటికిని కత్రినా, విక్కీ మాత్రం నోరు మెదపలేదు. ప్రస్తుతానికి వీరు సింగిల్‌ అని, డేటింగ్ చేయడం లేదని వీరి సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో.. దీపావళి పార్టీకి వీరిరువురూ జంటగా రావడంతో.. వీరి మధ్య ఏదో ఉందనే వార్తలు ఊపందుకున్నాయి.

#happydiwali #ManavManglani

A post shared by Manav Manglani (@manav.manglani) on

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు