‘ఆర్‌ఆర్‌ఆర్‌’ కోసం రంగంలోకి లాయిడ్‌ స్టీవెన్‌

22 Oct, 2018 15:37 IST|Sakshi

దర్శక ధీరుడు రాజమౌళి ‘బాహుబలి’ జాతీయ స్థాయిలో క్రేజ్‌ సంపాదించాడు. రాజమౌళి తరువాతి ప్రాజెక్ట్‌ కోసం దేశం మొత్తం ఎదురుచూస్తోంది. దానికి తగ్గట్టే యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌, మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌లతో కలిసి భారీ ప్రాజెక్ట్‌ను తెరకెక్కించనున్నాడు. ఇందుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ పనులు కూడా జరిగిపోతున్నట్లు సమాచారం. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ అప్‌డేట్‌ ఎన్టీఆర్‌ అభిమానులను ఖుషి చేస్తోంది. 

‘అరవింద సమేత’కు ఎన్టీఆర్‌ బాడీ లాంగ్వేజ్‌ను మార్చిన ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ లాయిడ్‌ స్టీవెన్‌ మళ్లీ రంగంలోకి దిగేశాడు. ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ కోసం ఎన్టీఆర్‌ ఫిట్‌నెస్‌ను మార్చేపనిలో ఉన్నాడట. ఈ విషయంపై జక్కన్నను కలిసి మాట్లాడిన విషయాన్ని, కలిసి దిగిన ఫోటోను స్టీవెన్‌ షేర్‌ చేస్తూ.. లెజెండరీ దర్శకుడిని కలిసినందుకు ఆనందంగా ఉందంటూ.. ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ కోసం ఎన్టీఆర్‌ లుక్‌పై చర్చించేందుకు వచ్చానని.. ఈ ప్రాజెక్ట్‌ కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నానని తెలిపాడు. ఈ మూవీ షూటింగ్‌ డిసెంబర్‌లో మొదలుకానున్నట్లు సమాచారం. 

మరిన్ని వార్తలు