బంగ్లాలో చిక్కుకున్న అమీర్ ‌ఖాన్ త‌న‌యుడు

16 Apr, 2020 09:07 IST|Sakshi

బాలీవుడ్‌ స్టార్ హీరో, మిస్టర్‌ పర్‌ఫెక‌్షనిస్టు అమీర్‌ ఖాన్ త‌న కుటుంబంతో క‌లిసి ముంబైలోని పాలీ హిల్‌లో నివ‌సిస్తున్నారు. కానీ ఆయ‌న‌ త‌న‌యుడు జునైద్‌ మాత్రం పాంచ్‌గానీ బంగ్లాలో చిక్కుకుపోయారు. అయితే ఏప్రిల్ 14న లాక్‌డౌన్ ముగుస్తుంద‌ని, అప్పుడు ఇంటికి రావ‌చ్చు అనుకునే స‌మ‌యానికి మే 3 వ‌ర‌కు లాక్‌డౌన్ పొడిగిస్తూ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. దీంతో అతడు ముంబైకి తిరిగి రావ‌డానికి వీల్లేకుండా పోయింది. అంద‌రూ ఒక్క‌చోట ఉంటే త‌న కొడుకు మాత్రం ఒంట‌రిగా ఉన్నాడంటూ హీరో విచారం వ్య‌క్తం చేశాడు. కాగా అమీర్‌, ఆయ‌న మొద‌టి భార్య రీనా ద‌త్తా సంతామే జునైద్, ఇరా. (డైరెక్టర్‌గా ఎంట్రీ ఇవ్వనున్న ఆమిర్‌ కూతురు!)

వీళ్లిద్ద‌రూ సినిమాలపై ఆసక్తి చూపిస్తుండ‌గా జునైద్ న‌ట‌న‌లో, ఇరా ద‌ర్శ‌క‌త్వంలో ఎంట‌ర‌య్యేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. ఇక తన కెరీర్‌ను మలుపు తిప్పిన ‘లగాన్‌’ సినిమా షూటింగ్‌ సమయంలో అమీర్‌.. అసిస్టెంట్‌ డైరెక్టర్‌ కిరణ్‌రావుతో ప్రేమలో ప‌డగా‌ ఆమెను రెండో వివాహం చేసుకున్నాడు. వీరికి ఆజాద్‌ అనే కుమారుడు ఉన్నాడు. కాగా అమీర్ ఖాన్ ప్ర‌స్తుతం "లాల్‌సింగ్‌ చ‌ద్దా" సినిమాలో న‌టిస్తున్నాడు. ఇది హాలీవుడ్ చిత్రం "ఫారెస్ట్ గంప్"‌కు రీమేక్‌. దీంతో పాటు గుల్ష‌న్ కుమార్ బ‌యోపిక్ "మొఘ‌ల్" సినిమాలో క‌నిపించ‌నున్నాడు. (ప్రేమ విషయాన్ని దాచలేదు: ఆమిర్‌ కూతురు)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా