లాక్‌డౌన్‌: యంగ్‌ టైగర్‌ మరో సాయం..

8 May, 2020 11:58 IST|Sakshi

కరోనా లాక్‌డౌన్‌ కారణంగా పేద, మధ్యతరగతి కుటుంబాలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఏదైనా పనిచేసుకుంటే గానీ పూటగడవని ఎంతో మంది అనేక అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో తన చు​ట్టూ ఉన్న వారిని ఆదుకోవడానకి యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌ నడుంబిగించారు. ఇప్పటికే కరోనా నేపథ్యంలో రూ.75 లక్షల విరాళం ప్రకటించి ఆర్థికంగా తన వంతు సాయాన్ని ప్రకటించారు. 

తాజాగా తన వ్యక్తిగత సిబ్బందికి ముందుగానే జీతాలు చెల్లించి వారికి అండగా నిలిచారు. అంతేకాకుండా తన సిబ్బందిలో ఎవరైనా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నట్లు తన దృష్టికి వస్తే వారికి మరింత సాయం చేసుందుకు ఎన్టీఆర్‌ సిద్దంగా ఉన్నట్లు ఆయన సన్నిహితులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. ఎన్టీఆర్‌ ఉదార స్వభావానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ‘సాహో ఎన్టీఆర్‌.. నీకు సెల్యూట్‌’ అంటూ ఓ అభిమాని కామెంట్‌ చేశాడు. 

ఎన్టీఆర్‌ ప్రస్తుతం రాజమౌళి ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రంతో బిజీగా ఉన్నాడు. లాక్‌డౌన్‌ కారణంగా ఈ సినిమా షూటింగ్‌ ఆగిపోయింది. దీంతో ప్రభుత్వ లాక్‌డౌన్‌ నిబంధనలను పాటిస్తూ ఇంటికే పరిమితమయ్యారు ఈ స్టార్‌ హీరో. ఆర్‌ఆర్‌ఆర్‌ తర్వాత త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో మరో చిత్రం చేయబోతున్నారు. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘అరవింద సమేత వీరరాఘవ’ బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా నిలిచిన విషయం తెలిసిందే. 

చదవండి:
‘సితారా.. సింగర్‌గా ట్రై చేయ్‌’
మార్పుని అలవాటు చేసుకోవాల్సిందే

మరిన్ని వార్తలు