నాతో నేను టైమ్‌ స్పెండ్‌ చేస్తున్నా...

29 Mar, 2020 13:55 IST|Sakshi

యోగా.. బుక్‌ రీడింగ్‌.. కుకింగ్‌..

కరోనా వైరస్‌ నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌తో సెలబ్రెటీలు ఇంటి పట్టునే ఉంటున్నారు. దీంతో తమకు ఇష్టమైన వ్యాపకాల్లో మునిగి తేలుతున్నారు. హీరోయిన్‌ రాశీకన్నా కూడా అదే పనిలో ఉన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...‘ఉదయాన్నే మా అమ్మకు ఇంటి పనుల్లో సహాయం చేస్తున్నాను. బ్రేక్‌ ఫాస్ట్‌ తయారు చేయడానికి సహాయం చేస్తున్నాను. ప్రస్తుతం వంట నేర్చుకుందాం అనుకుంటున్నాను. రోజులో సగం దాంతోనే గడిచిపోతోంది. ఇంట్లోనే వర్కవుట్స్‌ చేస్తున్నాను. కొన్ని సార్లు యోగా లేదంటే ఎక్సర్‌సైజ్‌  చేస్తా. అదే నన్ను రోజంతా యాక్టివ్‌గా ఉంచుతుంది. ప్రస్తుతం ’పవర్‌ ఆఫ్‌ ఇంటెన్షన్‌’ అనే  బుక్‌ చదువుతున్నాను. సాయంత్రాలు ఓ గంటా గంటన్నర  ధ్యానం చేస్తున్నాను. 

సరదాగా ఫ్యామిలీతో సమయం గడుపుతున్నా. మళ్లీ రాత్రి అమ్మతో కలసి ఏదో ఒకటి కుక్‌ చేస్తున్నా. కుటుంబంతో ఎక్కువ సమయం గడిపే వీలు దొరికింది. బిజీగా ఉన్నప్పుడు చేయాలనుకున్నవన్నీ ఇప్పుడు చేస్తున్నా. చదువుతున్నాను, సినిమాలు చూస్తున్నా, నా రూమ్‌ శుభ్రం  చేసుకుంటున్నా. ఈ లాక్‌ డౌన్‌తో నాతో నేను టైమ్‌ స్పెండ్‌ చేసే వీలు దొరికింది. గార్డెనింగ్‌ కూడా స్టార్ట్‌ చేయాలనుకుంటున్నాను’ అని తెలిపారు. (మా ఆవిడ పని చెబితే అది: అలీ)

ఇంటి పనులతో సమయం గడిచిపోతోంది 
హీరోయిన్‌ ఐశ్వర్యా అర్జున్‌  మాట్లాడుతూ...‘మాములు రోజుల్లో నేను ఇంట్లో ఉంటే టీవీ షోలు, సినిమాలు, ఆన్‌లైన్‌ షాపింగ్‌లకు టైమ్‌ కేటాయిస్తాను. కానీ ఇప్పుడు కరోనా కారణంగా నా జీవనశైలి కాస్త భిన్నంగా గడుస్తోంది. ప్రస్తుతం మా ఇంట్లో పనివారు ఎవరూ లేరు. అందుకుని ఇల్లు శుభ్రం చేయడం, వంట చేయడం (హెల్దీ ఫుడ్‌) వంటివి చేస్తున్నాను. పిజ్జా తయారు చేశాను. ఇది హెల్దీ పిజ్జా. ప్రస్తుత పరిస్థితుల్లో స్నేహితులను కలవకూడదు. అందుకే హౌస్‌ పార్టీ యాప్‌ ద్వారా కనెక్టై ఉన్నాను. (కరోనా: ఊపిరితిత్తులు ఎంతగా నాశనమయ్యాయో..)

సమయం ఉంటే వాళ్లతో చాటింగ్, ఆన్‌లైన్‌ గేమ్స్‌ అడుతున్నాను. లేకపోతే ఇంట్లో పనులతోనే రోజు గడిచిపోతోంది. నా దగ్గర ఓ డాగీ (కుక్క) ఉంది. దాని బాగోగులు చూసుకుంటున్నా. బయటకు తీసుకుని వెళ్లకూడదు కాబట్టి టెర్రస్‌ మీదకు తీసుకుని వెళ్లి టైమ్‌ స్పెండ్‌ చేస్తున్నాను. ఇంకా రోజుకి రెండు పుస్తకాలు చదివేలా నా టైమ్‌ను కాస్త జాగ్రత్తగా ప్లాన్‌ చేసుకోవాలనుకుంటున్నాను. ఈ చాలెంజింగ్‌ సమయంలో అందరం కలిసికట్టుగా ఉండాలి. ఇంట్లోనే ఉండి  సురక్షితంగా ఉందాం.’ అని పిలుపునిచ్చారు. (కిచెన్ స్వాధీనం చేసుకున్న రాజేంద్రప్రసాద్)    

మరిన్ని వార్తలు