లాక్‌డౌన్‌పై రకుల్‌ సుదీర్ఘ పోస్టు

25 Apr, 2020 11:54 IST|Sakshi

కరోనా మహమ్మారి కారణంగా ఎన్నో జీవితాలు చిన్నాభిన్నం అవుతున్నాయి. సెలబ్రిటీల నుంచి సాధారణ ప్రజల వరకు కరోనాతో యుధ్దం చేస్తున్నారు.  అయితే కరోనా కారణంగా షూటింగ్‌లకు విరామం దొరకడంతో నిత్యం బిజీబిజీ షెడ్యూల్‌తో ఉండే సెలబ్రిటీలంతా ఇంట్లో కుటంబంతో సరదాగా గడుపుతున్నారు. ఇంటిని శుభ్రం చేయడం, వంటలు చేయడం, ఫిట్‌నెస్‌ కాపాడుకోవడం, గతకాలపు జ్ఞాపకాలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడం వంటివి చేస్తూ అభిమానులకు చేరువగా ఉంటున్నారు. ఈ క్రమంలో హీరోయిన్‌ రకుల్‌ప్రీత్‌ సింగ్‌ లాక్‌డౌన్‌లో రోజూవారి షెడ్యూల్‌ను అభిమానులతో పంచుకున్నారు. అలాగే ఈ లాక్‌డౌన్‌ తనలో తెచ్చిన మార్పులను సోషల్‌ మీడియాలో సుదీర్ఘ పోస్ట్‌ చేశారు. (యూట్యూబ్‌ ఛానల్‌ ఆదాయమంతా దానికే: రకుల్‌)

‘నా సినిమా షూటింగ్‌ చివరగా మార్చి 18న జరిగింది. అప్పటి నుంచి ఇంట్లోనే ఉంటున్నా. లాక్‌డౌన్‌లో ముగిసే సమయానికి బద్దకంగా తయారవకుండా ఉండేందుకు పకడ్బందీ షెడ్యూల్‌ను తయారు చేసుకున్నా. రోజూ ఉదయం 6.30 నుంచి 7 గంటల లోపు నిద్ర లేస్తాను. కొద్దిసేపు చదువుకుంటాను. ఆ తరువాత యోగా చేస్తాను. ప్రస్తుతం వై వీ స్లీప్‌ అనే పుస్తకాన్ని చదువుతున్నారు. ఇప్పటికే చారియోట్స్‌ ఆఫ్‌ ద గాడ్స్‌, కాస్‌మిక్స్‌ కాన్షియస్‌నెస్‌ రెండు పుస్తకాలను పూర్తి చేశాను. మధ్యాహ్నం సోషల్‌ మీడియాలో కొంచెం సమయం కేటాయిస్తాను. గత రెండేళ్లలో ఆస్కార్‌ అవార్డు గెలుచుకున్న ప్రతి సినిమాను చూశాను. కొన్ని షోలను కూడా వీక్షిస్తున్నాను.  ప్రతి రోజు సాయంత్రం ఓ సినిమాతోపాటు ఏదైనా షోకు సంబంధించిన రెండు మూడు ఎపిసోడ్‌లను చూస్తాను. అలాగే ఇక ముఖ్యమైనది కుకింగ్‌. నాకు వంట మనిషి ఉన్నప్పటికీ నేను వంట చేస్తున్నాను. ఇటీవలే యూట్యూబ్‌లో వంటల ఛానల్‌ ఓపెన్‌ చేశాను. నా సోదరుడు ప్రస్తుతం నాతో ముంబైలో ఉంటున్నాడు. లాక్‌డౌన్‌కు ముందు రోజు నన్ను చూడానికి వచ్చి ఇక్కడే చిక్కుకుపోయాడు’.(ఒక్కరికైనా సాయపడండి)

‘నా జీవితంలో ఎప్పుడు ఇన్ని రోజులు ఇంట్లో ఉండలేదు. ఇదే నాజీవితంలో సుదీర్ఘకాల విరామం. చిన్నప్పుడు వేసవికాలం సెలవుల్లో కూడా ఇన్ని రోజులు ఒకచోట లేను. ఇంతకాలం ఇంట్లో ఉండటం అనేది ఒక కొత్త అనుభూతి అని నేను అనుకుంటున్నాను. ఒక విధంగా చెప్పాలంటే ఇది మంచిది ఎందుకంటే మనం ఏం చేసినా ప్రకృతికి దాని సొంత మార్గాలు ఉంటుందని మీరు అర్థం చేసుకుంటారు. ఇది స్వీయ ఆత్మ పరిశీలన చేసుకునే సమయం. మీతో మీరు కనెక్ట్‌ అయ్యే సమయం. నేను ప్రసస్తుతం పర్సనల్‌ డెవలప్‌మెంట్‌కు అధిక సమయం కేటాయిస్తున్నాను. ఈ సంక్షమం భూమి మీద మన మనుడగ చిన్నది అని నేర్పిస్తుంది. ఇలాంటి సమయంలో మీ ఆరోగ్యం, మీరు ఇష్టపడే వ్యక్తులు, మీ జ్ఞాపకాలు ఎంత ముఖ్యమైనవో తెలుసుకుంటారు. వీటి తర్వాతే మిగతావని మీరు గ్రహిస్తారు. మీరు మీ కోసం కష్టపడండి. ఎందుకంటే మీ జీవితాన్ని మీరే జీవించాలి. ప్రతి ఒక్కరు ఈ మహమ్మారి నుంచి బయటపడాలని ఆనందంగా జీవించాలని కోరుకోండి. అంటూ సుధీర్ఘ పోస్ట్‌ చేశారు.’ (కరోనాపై నవ్వుతూనే పోరాడాలి!)

మరిన్ని వార్తలు