-

మద్యం అమ్మకాలు: వ్యతిరేకిస్తున్న బాలీవుడ్‌ హీరోయిన్‌

2 May, 2020 16:01 IST|Sakshi

దేశ వ్యాప్తంగా రెండు వారాలపాటు లాక్‌డౌన్‌ పొడిగించిన నేపథ్యంలో గ్రీన్‌ జోన్లలలో కొన్ని నిబంధనలతో మద్యం షాపులు తెరుచుకోవచ్చని కేంద్రం తీసుకున్న నిర్ణయంపై బాలీవుడ్‌ హీరోయిన్‌ రవీనా టండన్‌, గేయ రచయిత జావేద్‌ అక్తర్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. లాక్‌డౌన్‌లో పాన్‌ సెంటర్లు, గుట్కా, మద్యం షాపులు, తెరుచుకోవడాన్ని వారు వ్యతిరేకించారు. ఈ మేరకు ట్విటర్‌ ద్వారా తమ అభిప్రాయాన్ని తెలిపారు. ‘‘అద్భుతం.. పాన్, గుట్కా షాపుల తెరుచుకుంటున్నాయి. ఇక ఉమ్మివేయడం కూడా మళ్లీ ప్రారంభమవుతుంది’ అంటూ రవీనా వ్యంగ్యంగా సమాధానమిచ్చారు. (వలస కార్మికులపై ఎందుకింత ఆలస్యం?)

లాక్‌డౌన్‌లో మద్యం ప్రజలపై త్వరగా ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని జావేద్‌ అక్తర్‌ అన్నారు. అంతేగాక దేశంలో ఇప్పటికే మద్యం కారణంగా గృహహింస కేసులు పెరుగుతున్నాయని ఆయన తెలిపారు. ‘‘లాక్ డౌన్ సమయంలో మద్యం దుకాణాలను తెరవడం వినాశకరమైన ఫలితాలను ఇస్తుంది. ఇక  అన్ని సర్వేల ప్రకారం ఈ కాలంలో గృహ హింస కేసులు చాలా వరకు పెరిగాయి. ఈ సమయంలో మద్యం అమ్మకాలకు అనుమతిస్తే అది మహిళలు, పిల్లలకు మరింత ప్రమాదకరంగా మారుతుంది’’. అని ట్వీట్‌ చేశారు. అయితే జావిద్‌ మద్యం సేవించడం మానేసినట్లు కనిపిస్తోందని ఓ నెటిజన్‌ ప్రశ్నించగా.. 1991 జూలై 30 మద్యం స్వీకరించిన చివరి రోజు అని జావేద్‌ బదులిచ్చారు. 
(18 వేల మందిని రాష్ట్రానికి తీసుకొస్తాం : సీఎం )

కాగా భారత్‌లో మే 3 వరకు ముగియనున్న లాక్‌డౌన్‌ను మే 17 వరకు ‌ పొడిగిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ ప్రటకించిన విషయం తెలిసిందే. అయితే లాక్‌డౌన్‌లో దేశంలోని అన్ని రాష్ట్రల్లోని జిల్లాలను మూడు జోన్లుగా వర్గీకరించారు. రెడ్‌, ఆరెంజ్,‌ గ్రీన్‌ జోన్లగా విభజించి.. మే 4 నుంచి కొన్ని సడలింపులు ఇచ్చింది. ఇందులో భాగంగా  గ్రీన్‌ జోన్లలలో కొన్ని నిబంధనలతో మద్యం షాపులు తెరుచుకోవచ్చని కేంద్రం శుక్రవారం ఆదేశించింది. మద్యం షాపులలో ఒకేసారి అయిదుగురికి మించి ఉండకూదనే నిబంధనలు పెట్టింది.
(మళ్లీ ట్రెండింగ్‌లోకి ‘మున్నా’.. 13 ఏళ్లైంది కదా! )

మరిన్ని వార్తలు