లిప్‌లాక్‌లో కమల్‌నే మించిపోయారు

30 Jun, 2016 01:43 IST|Sakshi
లిప్‌లాక్‌లో కమల్‌నే మించిపోయారు

చిత్రాల్లో లిప్‌లాక్ చుంభనాలంటే మొదట గుర్తొచ్చేది విశ్వనటుడు కమలహాసనేననే పేరుంది. అలాంటిది ఆయన్నే మించారట యువ నటుడు లొల్లుసభ జీవా. ఈయన రజనీకాంత్ వీరాభిమాని. పలు చిత్రాల్లో ప్రధానపాత్రలు పోషించిన లొల్లుసభ జీవా తాజాగా కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ఆరంభమే అట్టహాసం. ఏమిటీ ఈ టైటిల్ వినగానే నటుడు అజిత్ గుర్తుకొస్తున్నారా? ఆయన వీరాభిమాని రంగా ఈ చిత్రానికి దర్శకుడు.
 
 ఆ అభిమానమే అజిత్ నటించిన ఆరంభం, అట్టహాసం చిత్రాల పేర్లను తన ఒక్క చిత్రానికి టైటిల్‌గా నిర్ణయించేలా చేసిందని భావించవచ్చు. రంగా ఇంతకుముందు నాయ్‌కుట్టి అనే చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం త్వరలో విడుదలకు ముస్తాబవుతోంది. ఆయన రెండో చిత్రం ఆరంభమే అట్టహాసం. ఈ చిత్రం ద్వారా సంగీతాభట్ నాయకిగా పరిచయం అవుతున్నారు.
 
 కన్నడంకు చెందిన ఈ భామ అక్కడ పలు విజయవంతమైన చిత్రాల్లో నటించారట. ఇతర ప్రధాన పాత్రల్లో పాండియరాజన్, శ్యామ్స్, వైయాపురి, శ్రీనాథ్, వాసు విక్రమ్, కే.జ్ఞానసుందర్, మనీష్,నెల్లైశివ, తెనడై మధుమిత, లొల్లుసభ మనోహర్, లొల్లుసభ శేషు, లొల్లుసభ ఉదయ్  నటిస్తున్నారు. జేకే.దాస్ సంగీతాన్ని, ఆనంద్ చాయాగ్రహణం అందిస్తున్న ఈ చిత్రం గురించి దర్శకుడు తెలుపుతూ ఇది వినోదం గుభాళించే విభిన్న ప్రేమ కథా చిత్రం అని చెప్పారు.
 
 సాధారణంగా లిప్‌లాక్ చుంభనాలకు పెట్టిందిపేరు విశ్వనాయకుడు కమలహాసన్ అంటారని, ఆయన పత్రి చిత్రంలోనూ ఒక్క చుంభనం సన్నివేశం చోటు చేసుకుంటుందని అన్నారు. అలాంటిది ఈ చిత్రంలో లొల్లుసభ జీవా కథానాయకితో పదిమార్లు లిప్‌లాక్ చుంభనాల సన్నివేశాల్లో నటించి కమల్‌నే అధిగమించారని అన్నారు. చిత్ర షూటింగ్‌ను చెన్నై, కేరళ, హైదరాబాద్‌లలో చిత్రీకరిస్తున్నట్లు వెల్లడించారు. ఈ చిత్రాన్ని స్వాతీ ఫిలింస్ సర్య్కూట్ పతాకంపై మాలతీవేలు, ఎస్.సుక్కురుల్లా నిర్మిస్తున్నారని దర్శకుడు రంగా తెలిపారు.