నీరసించిన ‘లవ్‌ ఆజ్‌ కల్‌ 2’ కలెక్షన్లు

17 Feb, 2020 09:57 IST|Sakshi

ప్రేమికుల దినోత్సవం కానుకగా రిలీజైన బాలీవుడ్‌ చిత్రం ‘లవ్‌ ఆజ్‌ కల్‌ 2’. ఈ సినిమా మ్యాజిక్‌ చేస్తుందనుకుంటే అసలుకే ఎసరు పెట్టింది. సస్స్ర్కీన్‌ ప్లే వీక్‌గా ఉందంటూ పెదవి విరుస్తున్నారు. కానీ కొంతమంది ప్రేమికులు మాత్రం సారా, కార్తీక్‌ల కెమిస్ట్రీ అదిరిపోయిందంటూ సినిమాను ఆస్వాదిస్తున్నారు. ఈ జంట రీల్‌ లైఫ్‌లోనే కాకుండా రియల్‌ లైఫ్‌లోనూ చెట్టాపట్టాలేసుకుని తిరగడం తెలిసిందే. ఇక ఈ సినిమా విడుదలైన తొలి రోజు రూ.12 కోట్లు వసూలు చేయగా రెండో రోజు రూ.8 కోట్లు రాబట్టింది. ఇక ఆదివారం సుమారు రూ.10 కోట్లు వచ్చే అవకాశముందని సినీ విశ్లేషకులు అంచనా వేసినప్పటికీ రూ.6 కోట్లతో సరిపెట్టుకుంది.(ఆ హీరోయిన్‌ చాలా ఓవర్‌ చేసింది)

ఇప్పటివరకు మొత్తంగా రూ.26 కోట్లను వసూలు చేసిన ఈ చిత్రం థియేటర్లలో కనుమరుగయ్యే పరిస్థితి కనిపిస్తోంది. కాగా ఈ చిత్రం సైఫ్‌ అలీఖాన్‌, దీపికా పదుకునే నటించిన ‘లవ్‌ ఆజ్‌ కల్‌’ చిత్రానికి సీక్వెల్‌. ఈ సినిమాను తెరకెక్కించిన ఇంతియాజ్‌ అలీ సీక్వెల్‌కు సైతం దర్శకత్వం వహించాడు. అయితే ఈసారి అదే మ్యాజిక్‌ను రిపీట్‌ చేయలేకపోయాడు. కథలో కొత్తదనం లేదని, పాత చింతకాయ పచ్చడే అని కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇక సినిమాలో హీరోయిన్‌ సారా అలీఖాన్‌ ఓవర్‌ యాక్షన్‌ మాత్రం భరించలేకున్నామని మరికొందరు ఘాటుగానే స్పందించారు. తొలిరోజు అదుర్స్‌ అనిపించిన కలెక్షన్లు తర్వాత డీలా పడిపోయాయి. (‘లవ్‌ ఆజ్‌ కల్‌ 2’కు సెన్సార్‌ షాక్‌!) 

చదవండి: ‘లవ్‌ ఆజ్‌ కల్‌ 2’ ఫస్ట్‌ డే కలెక్షన్‌ రూ. 12 కోట్లు

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా