లవ్ ఆఫ్ భల్లాల దేవ!

25 Aug, 2015 22:26 IST|Sakshi
లవ్ ఆఫ్ భల్లాల దేవ!

అచ్చమైన తెలుగందం బిందుమాధవి చాలా విరామం తర్వాత ఓ అనువాద చిత్రంతో మళ్లీ తెలుగు ప్రేక్షకులను అలరించనున్నారు. తమిళంలో విమల్, బిందుమాధవి జంటగా ఎళిల్ దర్శకత్వంలో  రూపొందిన ‘దేశింగు రాజా’ చిత్రాన్ని ‘భల్లాల దేవ’ పేరుతో రావిపాటి సత్యనారాయణ తెలుగులో విడుదల చేయనున్నారు. ఈ సినిమా టీజర్‌ను మంగళవారం హైదరా బాద్‌లో సీనియర్ దర్శకుడు కోదండరామిరెడ్డి  ఆవిష్కరించారు. ‘‘ఈ సినిమాకు ‘భల్లాల దేవ’ అనే టైటిల్ పెట్టడం తమాషాగా ఉంది. తమిళంలో లాగే తెలుగులో కూడా విజయం సాధించాలి’’ అని కోదండరామిరెడ్డి ఆకాంక్షించారు.