భాయ్‌ భరోసా భయపెట్టింది

1 Oct, 2018 02:32 IST|Sakshi
వరీనా హుసేన్‌,ఆయుష్‌ శర్మ

‘‘ప్రేక్షకులు కొత్త నటులను రిసీవ్‌ చేసుకోవడానికి టైమ్‌ పడుతుంది. కానీ సల్మాన్‌ భాయ్‌ మమ్మల్ని పరిచయం చేయడం వల్ల ఆయన ఫ్యాన్స్‌ చూస్తారు అనే నమ్మకం ఉంది.  చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకూ అందరూ చూసే చిత్రం చేశాం’’ అని ఆయుష్‌ శర్మ అన్నారు. బావమరిది ఆయుష్‌ శర్మ, వరీనా హుసేన్‌ను హీరో హీరోయిన్లుగా పరిచయం చేస్తూ సల్మాన్‌ ఖాన్‌ నిర్మించిన చిత్రం ‘లవ్‌ యాత్రి’. అభిరాజ్‌ మినావల్‌ దర్శకుడు. ఈ చిత్రం అక్టోబర్‌ 5న రిలీజ్‌ కానుంది.

ఈ సందర్భంగా ఆయుష్‌ మాట్లాడుతూ – ‘‘ఆడియన్స్‌ ఎప్పుడు మా సినిమా చూస్తారా? అని ఎగై్జటింగ్‌గా ఉంది. సల్మాన్‌ భాయ్‌ బ్యానర్‌ వాల్యూకు తగ్గట్టుగా మంచి లవ్‌స్టోరీతో వస్తున్నాం. సినిమాలో హీరోయిన్‌ని ఒప్పించుకోవడానికి కొన్ని నెలలే పట్టింది కానీ సల్మాన్‌ సోదరి అర్పితాను లవ్‌లో పడేయటానికి నాలుగేళ్లు పట్టింది. హైదరాబాద్‌కి, నాకు మంచి అనుబంధం ఉంది. నా పెళ్లి ఇక్కడే జరిగింది. సౌత్‌ సినిమాలు మంచి కంటెంట్‌తో వస్తున్నాయి.

వెంకటేశ్, రామ్‌చరణ్, అఖిల్‌ తెలుసు. ఈ మధ్యకాలంలో నేను చూసిన తెలుగు సినిమాల్లో ‘అర్జున్‌ రెడ్డి పెళ్లి చూపులు’, తమిళ ‘తేరి, మెర్సల్‌’ నచ్చాయి’’ అన్నారు. ‘‘మాకు భాయ్‌ (సల్మాన్‌) ఇచ్చిన భరోసా భయపెట్టింది. ఆయన నమ్మకాన్ని నిలబెట్టాలనే లక్ష్యంతో సినిమా చేశాం. అంతా బాగానే ఉంది కానీ టైటిల్‌ వివాదమైంది. ‘లవ్‌ రాత్రి’ అని పెట్టకూడదన్నారు. దాంతో ‘లవ్‌ యాత్రి’ అని మార్చాం’’ అన్నారు హీరోయిన్‌ వరీనా హుసేన్‌.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా