లవ్ యు బంగారం అంటున్న రాహుల్

21 Jan, 2014 00:21 IST|Sakshi
లవ్ యు బంగారం అంటున్న రాహుల్
సీనియర్స్‌తో జూనియర్స్ ఫ్రెండ్‌షిప్పా.. కుద రదంటూ ‘హ్యాపీ డేస్’ చిత్రంలో సోనియా ఆటపట్టించిన టైసన్ అందరికీ గుర్తుండే ఉంటాడు. ఆ చిత్రంలో టైసన్ పాత్రలో రాహుల్ ఒదిగిపోయిన వైనం చాలామందిని ఆకట్టుకుంది. ఆ తర్వాత ‘రెయిన్‌బో’, ‘ప్రేమ ఒక మైకం’లో నటించిన రాహుల్ ప్రస్తుతం ‘లవ్ యు బంగారం’లో నటించారు. కేఎస్ రామారావు సమర్పణలో కె. వల్లభ, మారుతి నిర్మించిన ఈ చిత్రం ఈ శుక్రవారం విడుదల కానుంది. గోవి దర్శకత్వం వహించారు. ఈ చిత్రవిశేషాలను రాహుల్ చెబుతూ - ‘‘పేరున్న బేనర్, మంచి దర్శకులతో సినిమా చేస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని నా గురువు శేఖర్ కమ్ముల చెప్పారు.
 
ఆయన చెప్పిన అంశాలున్న సినిమా ఇది. హీరోగా నాకు మంచి గుర్తింపు తెచ్చిపెడుతుందనే నమ్మకం ఉంది. నటుడిగా నిరూపించుకోవడానికి ఆస్కారం లభించింది’’ అని చెప్పారు. ఈ చిత్రాన్ని నిర్మించిన క్రియేటివ్ కమర్షియల్స్, మారుతి టాకీస్‌లకే మరో సినిమా చేయనున్నానని, ఇంకొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయని రాహుల్ అన్నారు. కథానాయకుడిగానే నటించాలని నియమం పెట్టుకోలేదని, నటుడిగా నిరూపించుకోవడానికి ఆస్కారం ఉన్న ప్రధాన పాత్రలు చేయడానికి సిద్ధంగా ఉన్నానని రాహుల్ చెప్పారు.