పాటే నా ప్రాణం: చంద్రబోస్‌

26 Feb, 2020 09:30 IST|Sakshi

అభిమానుల సేవలు సంతోషం

 సాక్షి, భద్రాచలం : పాటే తన ప్రాణమని ప్రముఖ సినీ గేయ రచయిత చంద్రబోస్‌ అన్నారు. భద్రాద్రి కళాభారతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 18వ అంతరాష్ట్ర తెలుగు నాటకోత్సవాల ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా మంగళవారం భద్రాచలం విచ్చేశారు. ఈ సందర్భంగా సాక్షి పలుకరించగా పలు విషయాలు తెలిపారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే...

‘మాతృ భాషను కాపాడుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపైనా ఉంది. కీరవాణితో సినిమా అంటే ఎంతో మధురమైన పాటలు ఆశువుగా వచ్చేస్తాయి. పాటల రచయితకు అభిమానులుగా ఉంటూ.. గత నాలుగేళ్లుగా భద్రాచలానికి చెందిన తోటమళ్ల సురేష్‌, కృష్ణా రెడ్డి లాంటి వ్యక్తులు సేవ చేయడం మరిచిపోలేని విషయం. నేను భవిష్యత్తులోనూ వేరే రంగంలోకి వెళ్లబోను. సినిమానే నా ప్రపంచం. చివరి వరకు ఇందులోనే ఉంటా’. అని చంద్రబోస్‌ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు