దేవుడు దిగొచ్చినా వచ్చేసారి పోటీ చేయను

8 Mar, 2019 03:42 IST|Sakshi
వెంకటేశ్వరరావు, శ్రీకాంత్, శివాజీ రాజా, ఎస్వీ కృష్ణారెడ్డి, బెనర్జీ

– శివాజీరాజా

‘‘ఈ సారి ‘మా’ ఎన్నికల్లో పోటీ చేయకూడదనుకున్నా. కానీ నా ప్యానల్‌ సభ్యులు పట్టు బట్టారు. పద్మ అనే మహిళ నేను పోటీ చేయకుంటే ఆత్మహత్య చేసుకుంటాననీ, ‘మా’ పింఛన్‌ తీసుకోనని చెప్పారు. వీరందరి ప్రేమ పోటీ చేసేలా చేసింది. దేవుడు దిగొచ్చినా వచ్చేసారి పోటీ చేయను’’ అని ‘మా’ అధ్యక్షుడు శివాజీ రాజా అన్నారు. 2019–2021కి ‘మా’(మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌) ఎన్నికలు ఈ ఆదివారం జరగనున్నాయి. శివాజీరాజా ప్యానల్‌ సభ్యులు హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్‌ నిర్వహించారు.

శివాజీరాజా మాట్లాడుతూ– ‘‘నా గురించి శ్రీకాంత్‌ మాట పడుతున్నాడు.. నాకు సపోర్ట్‌ అందించేందుకు ఎస్వీ కృష్ణారెడ్డిలాంటి గొప్ప దర్శకుడు వచ్చారు. ‘మా’ ఎన్నికల టైమ్‌లో ఎవరూ టీవీల్లో మాట్లాడకూడదన్నది రూల్‌. కానీ సోదరుడు నరేశ్, బావ రాజశేఖర్, అక్క జీవితలు టీవీల్లో మాట్లాడుతూ మాపై బురద జల్లుతున్నారు. గత నెల 26న నా పుట్టినరోజున నన్ను ‘మా’ ఆఫీసులో వెయిట్‌ చేయించి, తను రాకుండా నరేశ్‌ అవమానించారు. పైగా ‘చూశావా.. నేను పగబడితే అంతే’ అంటూ ఫోనులో మరొకరితో చెప్పారు.

ఇలా పగబట్టే వ్యక్తి అధ్యక్షుడిగా అవసరమా? ఆ టైమ్‌లో బాధపడ్డాను. ఇండస్ట్రీ వదిలి అరుణాచలం వెళ్లి  సెటిల్‌ అయిపోదామనిపించింది. అవకాశాలు లేని 50 మంది చిన్న ఆర్టిస్టులకు 6నెలలకు సరిపడా వంట సరుకులు ఉచితంగా ఇచ్చేందుకు ఓ వ్యక్తి ముందుకొచ్చారు. ప్రస్తుతం ‘మా’ ఆధ్వర్యంలో 35మందికి నెలకి రూ.5000 ఇస్తున్నాం. దీన్ని ఈ దఫా నుంచి రూ.7500 ఇవ్వాలని నిర్ణయించాం’’ అన్నారు. ‘‘‘మా’ కి సొంత భవనంతో పాటు వృద్ధ కళాకారులకు ఓల్డేజ్‌ హోమ్‌(గోల్డేజ్‌ హామ్‌) నిర్మించాలనుకుంటున్నాడు.

నా వంతుగా శివాజీకి సహాయ పడాలనే ఉపాధ్యక్షునిగా పోటీ చేస్తున్నా’’ అని డైరెక్టర్‌ ఎస్వీ కృష్ణారెడ్డి అన్నారు. ‘‘2.90కోట్ల రూపాయలున్న ‘మా’ సంక్షేమ నిధిని శివాజీ రాజా 5.70కోట్లకు పెంచారు. ఈ దఫా నా నామినేషన్‌ని సరైన కారణం లేకుండా తిరస్కరించారు. నేను ట్రెజరర్‌గా ఉండటం నరేశ్‌కి కూడా ఇష్టం లేదేమో?’’ అన్నారు పరుచూరి వెంకటేశ్వరరావు. ‘‘అధ్యక్షునిగా ఒక్కసారి అవకాశం ఇవ్వండి అంటున్న నరేశ్‌గారు ‘మా’ జనరల్‌ సెక్రటరీగా ఏ మాత్రం సేవ చేశారు?’’ అని ప్రశ్నించారు ‘థర్టీ ఇయర్స్‌’ పృథ్వీ. ‘‘మా’ కి సొంత భవనం, గోల్డేజ్‌ హోం పూర్తి కావాలంటే శివాజీ ప్యానల్‌ని Vð లిపించాలి’’ అన్నారు హీరో శ్రీకాంత్‌.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు