‘ఆ సీన్‌లో నటించమంటే పారిపోయి వచ్చేశా’

13 Nov, 2019 19:02 IST|Sakshi

బాలీవుడ్ హీరోయిన్‌ మాన్వి గాగ్రూ ఆడిషన్స్ కోసం వెళ్లినప్పుడు తాను ఎదుర్కొన్న ఓ సంఘటన గురించి వెల్లడించింది. తాజాగా ఆమె ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, అప్పటి ఘటనను వివరించింది. ‘ఓ సినిమాలో అవకాశం కోసం ఆడిషన్స్ కు వెళ్లాను. అక్కడ ఉన్న వారు నన్ను అత్యాచారయత్న సీన్‌లో నటించమని కోరారు. అందులో బాగా నటిస్తే సినిమాకు సెలెక్ట్‌ చేస్తామన్నారు. ఆ ఆఫీసు చాలా చెత్తగా ఉండడంతో నాకు భయమేసింది.గదిలో పడక మంచం మాత్రమే ఉంది. అక్కడ ఇద్దరు వ్యక్తులు మాత్రమే ఉన్నారు. ఈ పరిస్థితి చూసి నేను భయంతో వెనక్కి చూడకుండ బయటకు పరుగులు పరుగుతీశా’ అని చెప్పింది.

మాన్వి ‘ఉజ్జా చమన్’ చిత్రంలో నటించి గుర్తింపు పొందింది. ఈ చిత్రంలో ఎక్కువ బరువు, లావుగా ఉన్న అమ్మాయిగా కనిపించిన మాన్వి బట్టతల ఉన్న హీరోను ఇష్టపడే అమ్మాయిగా నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. సన్నీసింగ్ హీరోగా నటించిన ఈ సినిమాకు అభిషేక్ పాథక్ దర్శకత్వం వహించారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా