అనుభూతినిచ్చే మాయ

15 Jul, 2014 23:49 IST|Sakshi
అనుభూతినిచ్చే మాయ

 మనుషుల్లో ఉండే అతీంద్రియ దృష్టి నేపథ్యంలో సాగే సైకలాజికల్ థ్రిల్లర్ ‘మాయ’. నీలకంఠ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో హర్షవర్దన్ రాణే, అవంతిక, సుష్మారాజ్, నందినిరాయ్ ప్రధాన పాత్రధారులు. ఎంవీకే రెడ్డి, మధుర శ్రీధర్ కలిసి నిర్మించిన ఈ చిత్రం ఆగస్ట్ 1న విడుదల కానుంది. వైవిధ్యమైన థ్రిల్లర్ ఇదని, ఈ సినిమా కథ, కథనం ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతినిస్తాయని నీలకంఠ అన్నారు. నీలకంఠ దర్శకత్వంలో ఇంత మంచి సినిమాను నిర్మించినందుకు గర్వపడుతున్నానని, సాంకేతికంగా తెలుగు సినిమాను మరో మెట్టుపై నిలబెట్టే సినిమా ఇదని మధుర శ్రీధర్ చెప్పారు. నాగబాబు, ఝాన్సీ, అనితా చౌదరి, వేణు తదితరులు ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కెమెరా: బాల్‌రెడ్డి, సంగీతం: శేఖర్‌చంద్ర, కూర్పు: నవీన్ నూలి, నిర్మాణం: షిర్డి సాయి కంబైన్స్.