‘మీ జంట ఎల్లప్పుడూ అందంగానే ఉంటుంది’

15 Jun, 2019 18:23 IST|Sakshi

నటి సిమ్రాన్‌తో మరోసారి స్క్రీన్‌ షేర్‌ చేసుకోనున్న విషయాన్ని హీరో మాధవన్‌ సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. తన అప్‌కమింగ్‌ మూవీ రాకెట్రీకి సంబంధించిన విశేషాల్లో భాగంగా సిమ్రాన్‌తో కలిసి ఉన్న ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశాడు. ‘ పదిహేనేళ్ల తర్వాత తిరు, ఇందిర శ్రీమతి, శ్రీ నంబి నారాయణన్‌గా’ అంటూ రాకెట్రీ మూవీలో సిమ్రన్‌ క్యారెక్టర్‌ను రివీల్‌ చేశాడు. ఈ క్రమంలో.. ‘మీ జంట ఎల్లప్పుడూ అందంగానే ఉంటుంది’ అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఇక ఇండియన్‌ స్పేస్‌ రీసెర్చ్‌ ఆర్గనైజేషన్‌ (ఇస్రో) మాజీ శాస్త్రవేత్త నంబి నారాయణన్‌ జీవిత సంఘటనల ఆధారంగా ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్‌’ అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే.

కాగా బుల్లితెర ద్వారా గుర్తింపు పొందిన ఉత్తరాది భామ సిమ్రాన్‌.. తర్వాతికాలంలో బాలీవుడ్‌లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. దక్షిణాదిన కూడా మంచి మార్కెట్‌ సంపాదించుకున్న ఈ అమ్మడు టాలీవుడ్‌, కోలీవుడ్‌లలో టాప్‌ హీరోయిన్‌గా కొనసాగారు. అయితే కొంతకాలంగా టీవీ షోలతో బిజీగా ఉన్న సిమ్రన్‌.. ప్రస్తుతం సినిమాలపై దృష్టి సారించారు. ఈ క్రమంలో ఇటీవల రజనీకాంత్‌ పేట సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.

ఇక గతంలో బాలచందర్‌ పార్థలే పరవశం, మణిరత్నం కన్నాతిల్‌ ముథమిట్టల్‌ సినిమాల్లో మాధవన్‌కు జంటగా నటించిన ఆమె.. తాజాగా సైంటిస్ట్‌ బయోపిక్‌లో మరోసారి ఆయనతో స్క్రీన్‌ షేర్‌ చేసుకోనున్నారు. నారాయణన్‌ పాత్రలో మాధవన్‌ నటిస్తుండగా.. ఆయన భార్య పాత్రలో సిమ్రన్‌ కనిపించనున్నారు. కాగా ఈ చిత్రానికి అనంత మహదేవన్‌తో పాటు మాధవన్‌ కూడా దర్శకుడిగా పని చేయాలనుకున్నారు. అయితే మహదేవన్‌ తప్పుకోవడంతో ఇప్పుడు పూర్తి స్థాయి దర్శకత్వ బాధ్యతలు చేపడుతున్నారు.

15 years later . Thiru and Indira turn into Mr. & Mrs. Nambi Narayanan. 🙏🙏🚀🚀#rocketryfilm @actormaddy #actormaddy #rocketrythenambieffect #15yearslater @SimranbaggaOffc @vijaymoolantalkies @simranrishibagga

A post shared by R. Madhavan (@actormaddy) on

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

తమిళ ఆటకు రానా నిర్మాత

నా ఫిట్‌నెస్‌ గురువు తనే

మిస్‌ ఫిజియో

చాలామందికి నా పేరు తెలియదు

ఇదొక అందమైన ప్రయాణం

నవ్వుల నవాబ్‌

వెబ్‌ ఇంట్లోకి...

చలో లాస్‌ ఏంజిల్స్‌

‘అలా 26 కిలోల బరువు తగ్గాను’

సమాజం ఓ సైకో.. రాధిక ఆప్టే ఫైర్‌

క్యారెక్టర్‌ కోసమే స్మోక్‌ చేశా..

సూర్య వ్యాఖ్యలను సమర్థించిన కమల్‌

హైకోర్టులో ‘బిగ్‌బాస్‌’ కి ఊరట

కండలవీరుడికి కబీర్‌ సింగ్‌ షాక్‌

అందుకే ‘కామ్రేడ్‌’కి నో చెప్పిందా!

ట్రోలింగ్‌ : తాప్సీ దిమ్మతిరిగే కౌంటర్‌

‘చెట్ల వెంట తిరుగుతూ డాన్స్‌ చేయలేను’

గుర్తుపట్టారా... తనెప్పటికీ బ్యూటీక్వీనే!

తమన్నా ప్లేస్‌లో అవికానా!

బిజీ అవుతోన్న ‘ఏజెంట్‌’

అమ్మదగ్గర కొన్ని యాక్టింగ్‌ స్కిల్స్ తీసుకున్నాను..

నాన్నా.. బయటకు వెళ్లు అన్నాడు!

‘పూరి ముఖంలో సక్సెస్‌ కనిపించింది’

ఫోర్బ్స్‌ లిస్ట్‌లో చేరినా సరే.. 100 పౌండ్ల కోసం

ఇస్మార్ట్‌ ఫిజిక్‌.. ఇదండీ టెక్నిక్‌

ఇప్పుడు ‘గ్యాంగ్‌ లీడర్’ పరిస్థితేంటి?

‘సినిమాల్లో తప్ప రియల్‌గా చీపురు పట్టింది లేదు’

మహేష్‌ మూవీ నుంచి జగ్గు భాయ్ అవుట్‌!

చదరంగం 

మరో రెండు!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

తమిళ ఆటకు రానా నిర్మాత

నా ఫిట్‌నెస్‌ గురువు తనే

మిస్‌ ఫిజియో

చాలామందికి నా పేరు తెలియదు

ఇదొక అందమైన ప్రయాణం

నవ్వుల నవాబ్‌