వయసు తగ్గింది

14 May, 2019 03:43 IST|Sakshi
మాధవన్‌

సౌత్‌ ఇండస్ట్రీల్లోని హ్యాండ్‌సమ్‌ హీరోల్లో మాధవన్‌ కచ్చితంగా ముందు వరుసలో ఉంటారు. అటువంటి ఆయన తాజాగా మరో పదేళ్లు వెనక్కివెళ్లిపోయారు అంటున్నారు ఆయన ఫ్యాన్స్‌. మాధవన్‌ ప్రస్తుతం ఇస్రో శాస్త్రవేత్త నంబీ నారాయణ్‌ బయోపిక్‌తో బిజీబిజీగా ఉన్నారు. ఆ సినిమాలో నారాయణ్‌ యువకుడిగా ఉన్నప్పటి సన్నివేశాలు చిత్రీకరించడానికి క్లీన్‌ షేవ్‌ చేసుకున్నారు మాధవన్‌. ఆ ఫొటో తన సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయగానే.. ‘భలే యంగైపోయారే!’ అంటూ ఫ్యాన్స్‌ కామెంట్స్‌ పోస్ట్‌ చేస్తున్నారు. ఈ యంగ్‌ లుక్‌ గురించి మాధవన్‌ మాట్లాడుతూ– ‘‘అమ్మ రెండేళ్ల నుంచి క్లీన్‌షేవ్‌ చేసుకోమని పోరుపెడుతోంది. నంబీ నారాయణ్‌ కోసం చేయాల్సి వచ్చింది. నంబీ యంగ్‌ ఎపిసోడ్‌ను ఫ్రాన్స్‌లో చిత్రీకరించనున్నాం’’ అన్నారు.

మరిన్ని వార్తలు