మాధవపెద్ది 40 ఏళ్ల ప్రస్థానం

13 Dec, 2013 00:51 IST|Sakshi
మాధవపెద్ది 40 ఏళ్ల ప్రస్థానం
 ప్రముఖ సంగీత దర్శకుడు మాధవపెద్ది సురేష్ సంగీత ప్రస్థానం మొదలై డిసెంబర్ 4కు 40 ఏళ్లు పూర్తయ్యింది. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో ఆయన పత్రికల వారితో మాట్లాడుతూ -‘‘1973లో కీబోర్డ్ ప్లేయర్‌గా కెరీర్ మొదలుపెట్టాను. 9 భాషల్లో ఎంతోమంది ప్రముఖ సంగీత దర్శకుల దగ్గర వెయ్యి సినిమాలకు పైగా కీబోర్డ్ ప్లేయర్‌గా పని చేశాను. 1988లో జంధ్యాల ‘హై హై నాయక’ చిత్రంతో సంగీత దర్శకునిగా నా ప్రయాణం మొదలైంది. 
 
 మ్యూజిక్ డెరైక్టర్‌గా కూడా ఈ ఏడాదితో పాతికేళ్లు పూర్తి చేసుకున్నాను. బృందావనం, భైరవద్వీపం, శ్రీకృష్ణార్జున విజయం, మేడమ్, మాతో పెట్టుకోకు, రామాయణం తదితర 50 చిత్రాలకు, 75 టీవీ సీరియళ్లకు, వందకు పైగా ప్రైవేటు ఆల్బమ్స్‌కి సంగీత దర్శకత్వం చేశాను’’ అని తెలిపారు. అతి త్వరలో ఆస్ట్రేలియాలో ఓ ప్రైవేటు ఆల్బమ్‌ని విడుదల చేయబోతున్నానని, అలాగే ప్రయోగాత్మకంగా ఫ్యూజన్ సంగీతంతో ఆల్బమ్స్ చేయబోతున్నానని మాధవపెద్ది చెప్పారు. ఈ నెల 15న పాతిక వసంతాల సినీసంగీత రజతోత్సవాన్ని అభిమానుల సమక్షంలో జరుపుకోబోతున్నానని ఆయన వెల్లడించారు.