రాకేష్‌ మాస్టర్‌పై మాధవీలత ఫైర్‌

27 May, 2020 12:04 IST|Sakshi

సోషల్‌ మీడియా వేదికగా క్షమాపణలు చెప్పాలి

లేకుంటే కోర్టు మెట్లు ఎక్కిస్తా: మాధవీలత

సాక్షి, హైదరాబాద్‌: గత కొద్దిరోజులుగా తనపై  అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న రాకేష్‌ మాస్టర్‌పై హీరోయిన్‌, బీజేపీ నాయకురాలు మాధవీలత ఆగ్రహం వ్యక్తం చేశారు. రాకేష్‌ మాస్టర్‌ ఎవరో తనకు తెలియదని పేర్కొన్న ఈ నటి అతడి వ్యాఖ్యలను తనను ఎంతగానో బాధించాయన్నారు. తనపై అసత్య ఆరోపణలు చేసినందుకు గాను సోషల్‌ మీడియా వేదికగా క్షమాపణలు చెప్పాలని లేని పక్షంలో న్యాయపరంగా ముందుకు వెళ్తానన్నారు. 

రాకేష్‌ మాస్టర్‌ను ఉపేక్షించేది లేదని కోర్టు, పోలీస్‌ స్టేషన్‌ మెట్లు ఎక్కించేలా చేస్తానని హెచ్చరించారు. అయితే ఈ విషయంపై ఎక్కువగా మాట్లాడదల్చుకోలేదని, అతడికి పరువునష్టం కేసు ద్వారానే సమాధానం చెప్పబోతున్నట్లు వివరించారు. ఈ విషయంలో బీజేపీ ఎమ్మెల్సీ, న్యాయవాది రాంచంద్రరావు దిశానిర్దేశంలో ముందుకు వెళ్లబోతున్నట్లు మాధవీ లత తెలిపారు. 

ఇక గత కొన్ని రోజులుగా రాకేష్‌ మాస్టర్‌ సోషల్‌ మీడియాలో తెగ హల్‌చల్‌ చేస్తున్న విషయం తెలిసిందే. టాలీవుడ్‌ ప్రముఖులపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ హాట్‌ టాపిక్‌గా మారాడు. అతడి వ్యాఖ్యలతో ఇండస్ట్రీ వర్గాల్లో పలు చర్చలకు కారణమవుతున్నాడు. ఇప్పటికే రాకేష్‌ మాస్టర్‌కు శ్రీరెడ్డి లీగల్‌ నోటీస్‌ పంపించగా తాజాగా మాధవీలత కూడా అదే మార్గంలో వెళ్లనుంది. మరి ఈ నోటీస్‌లపై రాకేష్‌ మాస్టర్‌ మరేం కామెంట్స్‌ చేస్తాడో వేచిచూడాలి.

చదవండి:
తాతయ్య కన్నుమూత.. ఉపాసన ట్వీట్
ఈశ్వర్‌,అల్లా,జీసస్‌లపై ఒట్టేసిన వర్మ

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా