‘ఇతరుల ఆనందం మా సొంతం’

15 Jul, 2020 09:42 IST|Sakshi

బాలీవుడ్‌ నటి మాధురీ దీక్షిత్ తన అద్భుతమైన డాన్స్‌, నటనతో ‘డ్యాన్సింగ్ క్వీన్’‌గా గుర్తింపు పొందిన విషయం తెలిసిందే. మాధురీ ఎప్పుడూ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌ ఉంటూ తన వృత్తిగత, వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటూ అలరిస్తారు. తాజాగా మాధురీ ఓ అద్భుతమైన  త్రోబ్యాక్‌(పాత) ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు. ‘మన ముఖం మీద కొద్దిగా ఆనందాన్ని తీసుకురావడం ద్వారా ఇతరులకు కంటే భిన్నంగా కనిపిస్తాము. అభిమానులు, ప్రజలు చిరునవ్వులు చిందించడానికి కారణాలను వెతుకుతూ ఉంటారు. ఇతరుల ఆనందాన్ని మా సొంతం చేసుకున్నాము​’ అని మాధురీ కామెంట్‌ జత చేశారు. (నటి మూడో పెళ్లిపై విమర్శలు; పోలీసులకు ఫిర్యాదు)

लाकर थोड़ी सी खुशी अपने चेहरे पर, हमने खुद को दूसरों से अलग बना लिया, लोग ढूंढते रहे मुस्कुराने का कारण, हमने दूसरों की खुशी को अपना बना लिया। ✨ #QuarantineThoughts

A post shared by Madhuri Dixit (@madhuridixitnene) on

మాధురీ 90ల్లో దిగిన స్టన్నింగ్‌ ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో నెటిజన్లు ఫిదా అవుతూ ఆమె అందాన్ని పొగుడుతూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ‘మీరు చాలా అందంగా ఉంటారు’ అని నెటిజన్‌ కామెంట్‌ చేశాడు. ‘మీరు ఎప్పటికీ ఎవర్‌ గ్రీన్‌’ అని మరో నెటిజన్‌ కామెంట్‌ చేశాడు. కరోనా వైరస్‌ కారణంగా ప్రస్తుతం మాధురీ ముంబైలోని తన నివాసంలో హోం క్వారంటైన్‌కి పరిమితమయ్యారు. సినిమాల విషయానికి వస్తే.. మాధురీ చివరగా ‘కలంక్’‌ చిత్రంలో కనిపించారు.  ఇటీవల మాధురీ గాయనిగా అవతారమెత్తి ‘క్యాండిల్‌’ పేరుతో ఓ పాట పాడిన విషయం తెలిసిందే. ఆమె ఈ పాటను కరోనా వైరస్‌ నివారణకు పోరాడుతున్న ‘కరోనా వారియర్స్‌’కు అంకితం​ చేశారు.(రజని, విజయ్‌లపై మీరామిథున్‌ ఫైర్‌)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా