డై..లాగి కొడితే...

27 Oct, 2016 00:18 IST|Sakshi
డై..లాగి కొడితే...

 సినిమా : మగధీర
 రచన: ఎం. రత్నం
 దర్శకత్వం: ఎస్‌ఎస్ రాజమౌళి

 
 భారతదేశాన్నంతటినీ తానొక్కడే పరిపాలించాలని ఇతర రాజ్యాలపై దండయాత్ర చే సే షేర్‌ఖాన్ (శ్రీహరి)  ఉదయ్‌ఘడ్ రాజ్యంపై దండెత్తేందుకు సైన్యంతో సిద్ధంగా ఉంటాడు. ఉదయ్‌ఘడ్ సుభిక్షంగా ఉండాలని యువరాణి మిత్రవిందతో (కాజల్ అగర్వాల్) భైరవకోనలో కాల భైరవునికి అభిషేకం చే యించే పనిలో ఉంటాడు కాలభైరవ (రామ్‌చరణ్). మిత్రవింద తనకు దక్కదని షేర్‌ఖాన్‌తో చేతులు కలిపి భైరవకోన వద్దకు వెళతాడు రణదేవ్ బిల్లా (దేవ్‌గిల్).
 
 నా మనుషుల్ని వందమందిని పంపిస్తా.. యువరాణి ఒంటిమీద చేయి పడకుండా ఆపు. ఈ రాజ్యాన్నీ, యువరాణిని నీకే అప్ప చెబుతా అంటాడు షేర్‌ఖాన్. వెన్ను చూపని వీరుల్ని ఎన్నుకుని పంపించ మని చెబుతాడు భైరవ. వాళ్లను చూస్తేనే నువు చస్తావురా అని షేర్ ఖాన్ హెచ్చరిస్తాడు. లెక్క ఎక్కువైనా ఫర్వాలేదు తక్కువ కాకుండా చూస్కో అని బదులిస్తాడు భైరవ. వందలో ఒక్కడు మిగిలినా నువు ఓడినట్టేరా అని షేర్‌ఖాన్ అంటే..
 
 ‘ఒక్కొక్కర్ని కాదు షేర్‌ఖాన్.. వందమందిని ఒకేసారి రమ్మను’ అంటాడు భైరవ. లక్షలాదికి నచ్చిన డైలాగ్ ఇది.