లండన్‌ దాకా డోల్‌బాజే అంటున్న తమన్నా

16 Jan, 2019 16:18 IST|Sakshi

తమన్నా ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న లేడీ ఓరియంటెడ్ సినిమా దట్‌ ఈజ్‌ మహాలక్ష్మి. బాలీవుడ్ సూపర్‌ హిట్ సినిమా క్వీన్‌కు రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ప్రశాంత్‌ వర్మ దర్శకుడు. ప్రస్తుతం తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఈ రీమేక్‌ పనులు జరుగుతున్నాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాలు ప్రారంభించారు చిత్రయూనిట్‌.

ఇప్పటికే  టీజర్‌తో ఆకట్టుకోగా తాజాగా ఫస్ట్ సింగిల్‌ను రిలీజ్ చేశారు. సినిమాలోని ప్రధాన పాత్ర మహాలక్ష్మి పెళ్లి వేడుకు సంబంధించిన ఈ పాటకు కృష్ణ కాంత్‌ సంగీతమందించారు. బాలీవుడ్ సంగీత దర్శకుడు అమిత్‌ త్రివేది సంగీతమందించిన ఈ పాటను గీతా మాధురి ఆలపించారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా