మహాప్రస్థానం మొదలైంది

23 Dec, 2019 00:38 IST|Sakshi
తనీష్

తనీష్, ముస్కాన్‌  సేథీ జంటగా జానీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘మహాప్రస్థానం’. ‘జర్నీ ఆఫ్‌ యాన్‌  ఎమోషనల్‌ కిల్లర్‌’ అనేది ఉపశీర్షిక. ‘వరుడు’ ఫేం భానుశ్రీ మెహ్రా, కబీర్‌ దుహాన్‌  సింగ్‌ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. తనీష్‌ మాట్లాడుతూ– ‘‘సినిమా సెట్‌లో నేను అడుగుపెట్టి ఏడాదిన్నర అవుతోంది. కథలు వింటున్నా నచ్చడం లేదు. జానీగారు చెప్పిన ‘మహాప్రస్థానం’ కథ నాలో ఎంతో స్ఫూర్తి నింపింది.  యాక్షన్‌ బ్యాక్‌డ్రాప్‌లో జరిగే కథ ఇది’’ అన్నారు. ‘‘నేను గతంలో ‘అంతకుమిం చి’ చిత్రాన్ని తెరకెక్కించా. ‘మహాప్రస్థానం’ నా రెండో సినిమా. యాక్షన్‌ బ్యాక్‌డ్రాప్‌లో జరిగే ఇంటెన్స్‌ లవ్‌ స్టోరీ ఇది’’ అన్నారు జాని. శుభాంగీ పంత్, గగన్‌  విహారి, అమిత్‌ నటిస్తున్న ఈ చిత్రానికి సం గీతం: సునీల్‌ కశ్యప్, కెమెరా: బాల్‌ రెడ్డి.

మరిన్ని వార్తలు