లాక్‌డౌన్‌ : దుర్భర జీవితం అనుభవిస్తున్న నటుడు

22 May, 2020 11:25 IST|Sakshi

లుధియానా : కరోనా నేపథ్యంలో దేశంలో విధించిన లాక్‌డౌన్‌ కొందరి జీవితాల్ని చిన్నాంబిన్నం చేస్తుంది. తాజాగా ప్రముఖ పంజాబీ సినీ, టీవీ నటుడు సతీష్‌ కౌల్‌ తినడానికి సరైన తిండి లేక, ఉండడానికి చోటు లేక దుర్భర జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. సతీష్‌ కౌల్‌ పీటీఐ న్యూస్‌ ఏజెన్సీతో మాట్లాడుతూ.. ' ప్రస్తుతం లుధియానాలో నా భార్య సత్యాదేవితో కలిసి ఒక చిన్న ఇంట్లో అద్దెకు ఉంటున్నా. అంతకుముందు ఒక ఓల్డేజ్‌ హోంలో ఉన్నాం. అయితే లాక్‌డౌన్‌ మా జీవితాలను తలకిందులు చేసింది. ప్రస్తుతం నా ఆరోగ్యం బాగానే ఉంది కానీ తినడానికి తిండి లుక , కొనుక్కోవడానికి మందులు,నిత్యావసరాల సరుకులు లేక చాలా ఇబ్బంది పడుతున్నాం.  

నటుడిగా ఒక వెలుగు వెలిగినప్పుడు అందరూ నా చుట్టూ ఉన్నారు.. పరిస్థితి కఠినంగా ఉన్నప్పుడు మాత్రం ఒక్కరు ముందుకు రాలేదు. నాకు సహాయం చేయాలని ఇండస్ట్రీలోని పలువురిని అడిగా.. ఎవరు స్పందించలేదు. అయితే  2015లో జరిగిన వెన్నుముక ప్రమాదం నన్ను ఆర్థికంగా చాలా కుంగదీసింది. దాదాపు రెండున్నర సంవత్సరాల పాటు ఆసుపత్రి బెడ్‌పైనే ఉండాల్సి వచ్చంది.  ఆ సమయంలోనే చికిత్స పేరుతో నా ఆస్తులు మొత్తం కరిగిపోయాయి. ఈ సమయంలోనే నా భార్యతో కలిసి ఓల్డేజ్‌ హోమ్‌లో కాలం వెళ్లదీశా' అంటూ తన గోడును వెళ్లబోసుకున్నాడు.

1988లో బీఆర్‌ చోప్రా తెరకెక్కించిన మహాభారతం సీరియల్‌లో ఇంద్రుడి పాత్రను పోషించిన సతీష్‌ కౌల్‌ పంజాబీ, హిందీ కలిపి దాదాపు 300 సినిమాల్లో నటించాడు. ప్యార్‌తో హోనా హై తా, ఆంటీ నం 1, జంజీర్‌, యారానా, రామ్‌లఖన్‌ వంటి హిట్‌ సినిమాల్లో నటించాడు. విక్రమ్‌ ఔర్‌ బేతాల్‌ అనే టీవి సీరియల్‌లో నటించిన సతీష్‌ కౌల్‌ను 2011లో పంజాబీ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకలో లైఫ్‌ టైం ఎచీవ్‌మెంట్‌ అవార్డుతో సత్కరించారు.
నాకు ఎవరితోనూ సంబంధం లేదు: అలియా
నా భర్త ఎంత హ్యాండ్‌సమ్‌గా ఉన్నాడో కదా??

మరిన్ని వార్తలు