మరో బయోపిక్‌లో..?

26 Apr, 2020 00:40 IST|Sakshi

అలనాటి తార సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘మహానటి’ చిత్రంలో సావిత్రి పాత్రలో నటించి, అందరి మెప్పు పొందారు కథానాయిక కీర్తీ సురేష్‌. ‘మహానటి’లో కీర్తి నటనకు జాతీయ అవార్డు వచ్చిన సంగతి తెలిసిందే. కీర్తీ సురేష్‌ మరో బయోపిక్‌లో నటించనున్నారన్నది ఫిల్మ్‌నగర్‌ లేటెస్ట్‌ టాక్‌. సూపర్‌స్టార్‌ కృష్ణ భార్య, ప్రముఖ నటి, అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన మహిళా దర్శకురాలిగా గిన్నిస్‌ బుక్‌లో స్థానం సంపాదించిన విజయ నిర్మల బయోపిక్‌ తెరకెక్కనుందట. ఇందులో విజయ నిర్మల పాత్రకు కీర్తీ సురేష్‌ను సంప్రదించారట. మరి మరో బయోపిక్‌లో కీర్తి కనబడతారా? వెయిట్‌ అండ్‌ సీ.

మరిన్ని వార్తలు