మహానేత పాటలు

3 Sep, 2013 01:40 IST|Sakshi
మహానేత పాటలు
‘‘కొన్నాళ్లక్రితం ఈ చిత్ర దర్శకుడు నన్ను కలిసి వైఎస్ రాజశేఖర్‌రెడ్డిగారిపై సినిమా తీస్తున్నామని చెప్పాడు.  కేవలం వైఎస్‌పై ఉండే వీరాభిమానంతోనే ఈ సినిమా తీస్తున్నాడని నాకు అర్థమైంది. ఇటీవలే పాటలు విన్నాను. చాలా అద్భుతంగా వచ్చాయి. 
 
 ఈ సినిమా కచ్చితంగా ప్రేక్షకాదరణ పొందాలని ఆశిస్తున్నాను’’ అని నందమూరి లక్ష్మీపార్వతి చెప్పారు. సీతారామయ్య, శ్రీనివాసరెడ్డి, ఉమ, సంజయ్‌కుమార్ ముఖ్యతారలుగా డి.రామచంద్రారెడ్డి దర్శకత్వంలో పుట్టా యాదయ్య, పోరందస్వామి, నాగిరెడ్డి, సురేష్‌రెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘మహానేత’. ఈ సినిమా పాటల సీడీని సోమవారం హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. 
 
 వచ్చే నెల 10న చిత్రాన్ని విడుదల చేస్తామని నిర్మాతలు తెలిపారు. వైఎస్ చారిత్రాత్మక కథానాయకుడని విజయరాఘవాచారి అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో లక్ష్మణ్‌సాయి, సాయివెంకట్, మోహన్‌గౌడ్ తదితరులు మాట్లాడారు.