7లో 5 హిట్లు చిన్న విషయం కాదు! – ‘దిల్‌’ రాజు

10 Oct, 2017 05:04 IST|Sakshi

‘‘ఆర్య’ సినిమాతో డిస్ట్రిబ్యూటర్‌గా స్టార్ట్‌ అయిన వంశీ ఇప్పుడు నాతో సమానంగా విజయవంతమైన సినిమాలు చేస్తున్నాడు. ఏడు సినిమాల్లో ఐదు సక్సెస్‌ఫుల్‌ సినిమాలు చేయడం చిన్న విషయం కాదు. ఎంత హార్డ్‌వర్క్‌ చేస్తే సక్సెస్‌ వస్తుందో నాకు తెలుసు’’ అని నిర్మాత ‘దిల్‌’ రాజు అన్నారు. శర్వానంద్, మెహరీన్‌ జంటగా మారుతి దర్శకత్వంలో వంశీ, ప్రమోద్‌ నిర్మించిన ‘మహానుభావుడు’ సెప్టెంబర్‌ 29న విడుదలై మంచి హిట్‌ అయింది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో సక్సెస్‌మీట్‌ నిర్వహించారు. ‘దిల్‌’ రాజు మాట్లాడుతూ– ‘‘పన్నెండు, పదమూడేళ్లుగా  శర్వానంద్‌ తెలుసు. హీరో సినిమాను మెయిన్‌గా రన్‌ చేయాలి.

శర్వా ఆ బాధ్యత నిలబెట్టుకుంటున్నాడు. ప్రేక్షకుడు సినిమాను ఎంజాయ్‌ చేయాలనే ఆలోచనతో మారుతి కథలు రాసుకుంటుంటాడు. తన సక్సెస్‌ ఫార్ములా అదే’’ అన్నారు.  మారుతి మాట్లాడుతూ– ‘‘భలే భలే మగాడివోయ్‌’ తర్వాత నేను ఎంజాయ్‌ చేస్తూ జరుపుకున్న పుట్టినరోజు ఇది. ‘మహానుభావుడు’ సక్సెస్‌ రూపంలో ప్రేక్షకులు నాకు గిఫ్ట్‌ ఇచ్చారు. నిర్మాతలు వంశీ, ప్రమోద్, విక్కీ, ఎస్‌కేయన్‌లకు థ్యాంక్స్‌’’ అన్నారు. ‘‘మహానుభావుడు’ చేసినందుకు ఓ నటుడిగా చాలా హ్యాపీగా, సంతృప్తిగా ఉన్నా. ఇంత మంచి సినిమా నాదని చెప్పుకోవడానికి గర్వంగా ఉంది’’ అన్నారు శర్వానంద్‌. ‘‘ఈ సినిమాలో భాగమైనందుకు ఆనందంగా ఉంది. మేఘన రోల్‌ ఇచ్చినందుకు మారుతిగారికి థ్యాంక్స్‌’’ అన్నారు మెహరీన్‌.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు