శర్వా మా ఇంటి హీరో – ప్రభాస్‌

25 Sep, 2017 10:08 IST|Sakshi

‘శర్వా (శర్వానంద్‌) మా ఇంటి హీరో. తన యాటిట్యూడ్‌ సూపర్‌గా ఉంటుంది. భవిష్యత్‌లో శర్వా సూపర్‌స్టార్‌ అవుతాడు’’ అన్నారు ప్రభాస్‌. శర్వానంద్‌ హీరోగా మారుతి దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్‌ పతాకంపై వంశీ, ప్రమోద్‌లు నిర్మించిన చిత్రం ‘మహానుభావుడు’. ఎస్‌కెఎన్‌ సహనిర్మాత. మెహరీన్‌ కథానాయిక. తమన్‌ స్వరకర్త. ఈ నెల 29న విడుదల కానున్న ఈ సినిమా ప్రీ–రిలీజ్‌ ఫంక్షన్‌ను ఆదివారం నిర్వహించారు. ముఖ్య అతిథి ప్రభాస్‌ మాట్లాడుతూ– ‘‘రన్‌ రాజా రన్‌’కి హీరోగా ఎవరు బాగుంటారనుకుంటున్నప్పుడు ‘శర్వా యాటిట్యూడ్‌ సూపర్‌గా ఉంటుంది.

తనని తీసుకుందాం’ అని వంశీ అన్నాడు. శర్వా ఎంటర్‌టైన్‌మెంట్‌ క్యారెక్టర్‌ ఎప్పుడూ చేయలేదు. అదే శర్వాతో అంటే, ‘ట్రై చేస్తా. చూడండి. నచ్చకపోతే చెప్పండి’ అన్నాడు. ఆ యాటిట్యూడ్‌ మాకు నచ్చింది. శర్వాకు మేమందరం ఫ్యాన్స్‌ అయిపోయాం. ఆల్రేడీ హీరోగా చేసి, ‘నచ్చితే చూడండి’ అన్నాడు. ఆ రోజు నుంచి నాకు శర్వా బ్రదర్‌ అయిపోయాడు. మారుతి నిజంగా డాక్టర్‌. ఒక మనిషిని నవ్వించడం అంత ఈజీ కాదు. ‘ప్రేమక«థా చిత్రమ్‌’, ‘భలే భలే మగాడివోయ్‌’ చిత్రాలకన్నా ‘మహానుభావుడు’ ఇంకా పెద్ద రేంజ్‌ హిట్టవ్వాలని కోరుకుంటున్నాను.

తమన్‌ మంచి పాటలిచ్చాడు’’ అన్నారు. శర్వానంద్‌ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాలో నేను మహానుభావుడిని అయితే రియల్‌ లైఫ్‌లో మహానుభావుడు ప్రభాస్‌ అన్న. తను ఇక్కడికి వచ్చాడని ఇలా అనడంలేదు. మనస్ఫూర్తిగా చెబుతున్నా. ప్రభాస్‌ అన్నకు ప్రేమ ఇవ్వడం తప్ప ఇంకేమీ తెలీదు. నా సినిమా ఎప్పుడు రిలీజైనా నాకన్నా ఎక్కువ టెన్షన్‌ పడేది ప్రభాస్‌ అన్నే. నేను ‘రన్‌ రాజా రన్‌’ చేసినప్పుడు ‘హిట్‌ కొట్టాంరా.. ఎంజాయ్‌ చెయ్‌’ అన్నాడు. పక్క వ్యక్తి పైకి రావాలని కోరుకునే వ్యక్తుల్లో ప్రభాస్‌ ఫస్ట్‌ ఉంటాడు. మా అందరికీ ఇంత సపోర్ట్‌ ఇచ్చినందుకు తనకు థ్యాంక్స్‌.

మంచి సినిమా ఇచ్చినందుకు మారుతీగారికి థ్యాంక్స్‌. టీమ్‌ అందరికీ థ్యాంక్స్‌’’ అన్నారు. మారుతి మాట్లాడుతూ– ‘‘ప్రభాస్‌ వచ్చి ఈ సినిమాను మరో మెట్టు పైకి తీసుకెళ్లారు. ఈ సినిమాకు శర్వానంద్‌ ప్రాణం పోశారు. శర్వా విశ్వరూపాన్ని థియేటర్లలో చూస్తారు. కొత్త శర్వాన్ని చూడబోతున్నారు. ‘భలే భలే మగాడివోయ్‌’లో నానీ యాక్షన్‌కి ఎంత ఎగై్జట్‌ అయ్యానో అంతకు డబుల్‌ ఎగై్జట్‌మెంట్‌ శర్వా నాకు ఇచ్చారు. నేను రాసుకున్న కథకు అందరూ ప్రాణం పోశారు. ఇలాంటి కాన్సెప్ట్స్‌ అరుదుగా వస్తాయి. ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా.

ఎమోషనల్‌ మూవీ. మంచి సినిమా తీయాడానికి కారణమైన యూవీ క్రియేషన్స్‌ వారికి రుణపడి ఉంటాను. ప్రభాస్‌గారు వచ్చినందుకు థ్యాంక్స్‌. ఆయనతో ఎప్పటికైనా సినిమా తీస్తా’’ అన్నారు. ‘‘నేను ప్రభాస్‌ ఫ్యాన్‌ని. ఆయన లాంచ్‌ చేసిన నా లాస్ట్‌ ఆడియో ‘బృందావనం’. ఆ రోజు నుంచి ఈ రోజు వరకూ ఎంకరేజ్‌ చేస్తున్నారు. మారుతి వన్నాఫ్‌ ది బెస్ట్‌ డైరెక్టర్స్‌. నా దగ్గర్నుంచి బాగా వర్క్స్‌ తీసుకున్నాడు. నిర్మాతలకు థ్యాంక్స్‌’’ అన్నారు. నిర్మాతలు వంశీ, ప్రమోద్‌ తదితరులు పాల్గొన్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా