విలేజ్‌లో మహర్షి

4 Nov, 2018 06:27 IST|Sakshi
మహేశ్‌బాబు

స్నేహితుడు, క్లాస్‌మేట్‌ రవి ఉండే విలేజ్‌కి వెళ్లడానికి సిద్ధమవుతున్నారట రిచ్‌ బిజినెస్‌మేన్‌ రిషి. మహేశ్‌బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘మహర్షి’. పూజాహెగ్డే కథానాయికగా నటిస్తున్నారు. రిషి పాత్రలో మహేశ్‌బాబు, రవి పాత్రలో ‘అల్లరి’ నరేశ్‌ నటిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా షూటింగ్‌ షెడ్యూల్‌ యూఎస్‌లో ప్రారంభమైన సంగతి తెలిసిందే. మహేశ్‌బాబు, జయసుధ, పూజాలపై కీలక సన్నిశాలను ప్లాన్‌ చేశారు. ఈ చిత్రం నెక్ట్స్‌ షెడ్యూల్‌ హైదరాబాద్‌లో ప్రారంభం కానుంది.

ఇందుకోసం హైదరాబాద్‌లోని ఓ స్టూడియోలో విలేజ్‌ సెట్‌ రెడీ చేస్తున్నారు. సినిమాలోని కథ పరంగా రాజమహేంద్రవరానికి దగ్గరగా ఉండే ఓ గ్రామంలో ‘అల్లరి’ నరేశ్‌ ఉంటారట. ఒక కారణం చేత నరేశ్‌ను కలవడానికి మహేశ్‌బాబు ఆ గ్రామానికి వెళతారు. ఆ కారణం ఏంటి? అనేది సస్పెన్స్‌. హైదారాబాద్‌లో వేసిన విలేజ్‌ సెట్‌లో ఈ సన్నివేశాలనే దాదాపు 25 రోజుల పాటు చిత్రీకరించనున్నారట. ‘మహర్షి’ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్‌ 5న విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్‌ స్వరకర్త.

మరిన్ని వార్తలు