బర్త్‌డే స్పెషల్‌

18 Apr, 2020 04:21 IST|Sakshi
విక్రమ్

కర్ణుడిగా విక్రమ్‌ నటిస్తున్న చిత్రం ‘మహావీర్‌ కర్ణ’. మలయాళ దర్శకుడు ఆర్‌ఎస్‌ విమల్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. న్యూయార్క్‌కు చెందిన యునైటెడ్‌ ఫిల్మ్‌ కింగ్‌డమ్‌ ఈ చిత్రాన్ని దాదాపు 300 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిస్తోంది. మహాభారతంలోని కర్ణుడి పాత్ర నేపథ్యంలో సాగే ఈ సినిమాలో కర్ణుడిగా నటిస్తున్నారు విక్రమ్‌. శుక్రవారం (ఏప్రిల్‌ 17) విక్రమ్‌ బర్త్‌డే. ఈ సందర్భంగా ‘మహావీర్‌ కర్ణ’కు సంబంధించిన ఓ చిన్న వీడియోను విడుదల చేశారు.

హిందీ, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాను తెలుగులో కూడా విడుదల చేయాలనుకుంటున్నారు. అలాగే అజయ్‌ జ్ఞానముత్తు డైరెక్ట్‌ చేస్తోన్న ‘కోబ్రా’ చిత్రంలో నటిస్తున్నారు విక్రమ్‌. ‘కోబ్రా’ టీమ్‌ కూడా విక్రమ్‌కు బర్త్‌డే శుభాకాంక్షలు తెలుపుతూ ఓ వీడియోను విడుదల చేసింది. ఈ సినిమాలే కాకుండా మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘పొన్నియిన్‌ సెల్వన్‌’లో ఒక లీడ్‌ క్యారెక్టర్‌ చేస్తున్నారు విక్రమ్‌. లాక్‌డౌన్‌ కారణంగా ఈ సినిమాల చిత్రీకరణకు తాత్కాలికంగా బ్రేక్‌ పడింది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు