సినిమా ట్రైలర్పై ప్రశంసల జల్లు

2 Sep, 2015 15:41 IST|Sakshi
సినిమా ట్రైలర్పై ప్రశంసల జల్లు

మెగా ఫ్యామిలీ వారసుడు వరుణ్ తేజ్ రెండో సినిమాగా తెరకెక్కిన 'కంచె' ట్రైలర్ సినీ అభిమానులతో పాటు సినీ ప్రముఖులను కూడా ఆకట్టుకుంటుంది.  ప్రముఖ హీరోలతో పాటు ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులు కూడా ట్రైలర్ బాగుందంటూ సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తున్నారు. శ్రీమంతుడు సినిమా సక్సెస్ తరువాత ఫారిన్ టూర్ లో ఉన్న సూపర్ స్టార్ మహేష్ కూడా ఈ ట్రైలర్పై స్పందించాడు.

'కంచె' టీజర్ పై తన ట్విట్టర్ లో ప్రశంసలు కురిపించాడు. రెండో ప్రపంచ యుద్ధ నేపధ్యంతో తెరకెక్కిన కంచె ట్రైలర్ను  చిత్ర యూనిట్ .. ఆ యుద్దం మొదలైన సెప్టెంబర్ 1న రాజమౌళి చేతుల మీదుగా విడుదల చేయించారు.  ఈ చిత్రం అక్టోబర్ 2న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతోంది. 'ముకుంద' చిత్రంతో వెండితెరకు ఎంట్రీ ఇచ్చిన వరుణ్ తేజ్... ఆ సినిమాలో క్లాసీ మాస్గా కనిపిస్తే...కంచెలో మాత్రం డిఫరెంట్ లుక్లో ఆకట్టుకుంటున్నాడు.

 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి