డిక్కీ బలిసిన కోడి చికెన్ షాపు ముందుకొచ్చి...

9 Aug, 2014 09:14 IST|Sakshi
డిక్కీ బలిసిన కోడి చికెన్ షాపు ముందుకొచ్చి...

''డిక్కీ బలిసిన కోడి చికెన్ షాపు ముందుకొచ్చి తొడ కొట్టిందట. అయినా నువ్వు డైలాగ్ వేస్తే...కౌంటర్ ఇవ్వటానికి నేనేమైనా రైటర్నా..ఫైటర్ని ... అయ్బాబోయ్ నాకు కూడా సినిమా డైలాగ్స్ వచ్చేస్తున్నాయి...'' ఈ డైలాగ్స్ ఏ సినిమాలోవా అనుకుంటున్నారు కదూ...   ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మహేష్ బాబు  'ఆగడు' చిత్రం లోనివి. శనివారం (ఆగస్ట్ 9) మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా...  14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ ఈ కొత్త టీజర్ను విడుదల చేసింది.


సూపర్ స్టార్ కృష్ణ జన్మదినోత్సవం సందర్భంగా విడుదలైన ఈ సినిమా మొదటి టీజర్ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు...  ఇంకా ఆ ఊపులోనే ఉన్న మహేష్ అభిమానులకు .... తాజా టీజర్ మరింత కిక్ ఇచ్చిందనటంలో సందేహం లేదు.  శ్రీను వైట్ల దర్శకత్వంలో రాం ఆచంట, గోపీ ఆచంట, అనీల్ సుంకర ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మహేష్ బాబు సరసన హీరోయిన్ తమన్నాతొలిసారి నటిస్తోంది. ఇక మహేష్ తనయుడు గౌతమ్ బర్త్‌డే ఈనెల 31న చిత్ర ఆడియో ఫంక్షన్‌కు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా మహేష్ బాబుకు సాక్షి డాట్ కామ్... బర్త్డే విషెస్ తెలుపుతోంది.

 

Load Comments
Hide Comments
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

పవన్‌ కళ్యాణ్‌పై జాలేసింది

మరో సినిమా లైన్‌లో పెట్టిన విజయ్‌

ఇక పాకిస్తాన్‌ గురించి ఏం మాట్లడతాం?

‘నిశబ్ధం’ మొదలైంది!

చిన్నా, పెద్ద చూడను!

‘సీత’ మూవీ రివ్యూ