చాలెంజ్‌ను స్వీకరించిన సూపర్‌స్టార్‌

30 Jul, 2018 21:42 IST|Sakshi

రైస్‌ బకెట్‌ చాలెంజ్‌తో మొదలైన ఉద్యమం.. ఎన్నో సామాజిక విషయాల్లో చాలెంజ్‌లు విసురుతూ సోషల్‌ మీడియా వేదికగా వైరల్‌ అవుతున్నాయి. మొన్నామధ్య క్రీడా శాఖా మంత్రి రాజ్యవర్ధన్‌ విసిరిన హమ్‌ ఫిట్‌తో ఇండియా ఫిట్‌ చాలెంజ్‌ ఎంత పాపులర్‌ అయిందో వేరే చెప్పనక్కర్లేదు. బాలీవుడ్‌ను దాటి టాలివుడ్‌కు ప్రవేశించిన ఈ చాలెంజ్‌ను.. కుర్ర హీరోలతో పాటు సీనియర్‌ హీరోలు ఈ చాలెంజ్‌ను స్వీకరించారు.

తాజాగా హరితహారం చాలెంజ్‌ వైరల్‌గా మారుతోంది. కేటీఆర్‌, కవిత, సచిన్‌, రాజమౌళి లాంటి సెలబ్రెటిలు చాలెంజ్‌ను స్వీకరించి ఓ మొక్కను నాటి మరికొంత మందికి ఈ చాలెంజ్‌ను విసిరారు. కేటీఆర్‌ విసిరిన ఈ చాలెంజ్‌ను తాజాగా సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబు స్వీకరించారు. తన కూతురుతో కలిసి ఓ మొక్కను నాటుతున్న ఫోటోను పోస్ట్‌ చేస్తూ.. తనను నామినేట్‌ చేసినందుకు కేటీఆర్‌కు ధన్యవాదాలు తెలుపుతూ.. గౌతమ్‌, సితారా, వంశీ పైడిపల్లికి చాలెంజ్‌ను విసిరారు. మహేష్‌ బాబు ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు