ముఖ్యమంత్రిగా మహేష్..?

25 Sep, 2016 08:20 IST|Sakshi
ముఖ్యమంత్రిగా మహేష్..?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు.. ఓ ఇంట్రస్టింగ్ క్యారెక్టర్‌కు ఓకె చెప్పాడన్నా వార్త ఇప్పుడు ఫిలిం సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం తమిళ స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్ సినిమాలో నటిస్తున్నాడు మహేష్. దాదాపు 90 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాను 2017  సమ్మర్లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.

ఈ సినిమా తరువాత తనకు శ్రీమంతుడు లాంటి భారీ హిట్ అందించిన కొరటాల శివ దర్శకత్వంలో మరో సినిమాకు ఓకె చెప్పాడు. కమర్షియల్ ఎలిమెంట్స్ మిస్ కాకుండా సోషల్ మెసేజ్ ఇచ్చే కొరటాల, మహేష్ కోసం ఓ పొలిటికల్ థ్రిల్లర్‌ను రెడీ చేస్తున్నాడట. ఈ సినిమాలో మహేష్ బాబు ముఖ్యమంత్రి కనిపించనున్నాడన్న టాక్ వినిపిస్తోంది.

గతంలో దూకుడు సినిమాలో కొద్ది సేపు ఎమ్మెల్యేగా అలరించిన మహేష్ నెక్ట్స్ సినిమాలో సియంగా కనిపిస్తాడన్న వార్తతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. అయితే ఈ విషయంపై మహేష్ నుంచి గాని, దర్శకుడు కొరటాల శివ నుంచి గాని ఎలాంటి అధికారిక ప్రకటనా రాలేదు.