అక్కతో సినిమా కూడా చేస్తానేమో?

15 Feb, 2018 00:19 IST|Sakshi
కిరణ్, సంజయ్, మహేశ్‌బాబు, జాహ్నవి, మంజుల, అమైరా, సందీప్‌ కిషన్‌

‘‘మంజుల డైరెక్షన్‌ చేస్తుందని ఊహించలేదు. హాలిడేస్‌ టైమ్‌లో తను ఏదో రాసుకుంటుంటే కవిత రాసుకుంటుందేమో అనుకున్నా. కానీ సినిమా కథ రాసుకుంటుందని అనుకోలేదు’’ అని హీరో మహేశ్‌బాబు అన్నారు. సందీప్‌ కిషన్, అమైరా దస్తూర్, త్రిదా చౌదరి హీరో హీరోయిన్లుగా మంజుల దర్శకత్వంలో సంజయ్‌ స్వరూప్, పి.కిరణ్‌ నిర్మించిన ‘మనసుకు నచ్చింది’ సినిమా రేపు విడుదలవుతోంది.

ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ–రిలీజ్‌ వేడుకకి ముఖ్య అతిథిగా విచ్చేసిన మహేశ్‌బాబు మాట్లాడుతూ– ‘‘మంజుల కథ ప్రిపేర్‌ చేసుకొని, సినిమా చేయబోతున్నానని చెప్పినప్పుడు నేను షాక్‌ అయ్యా. ఒకరకంగా గర్వంగా ఫీలయ్యాను. విజువల్స్‌ బాగా నచ్చాయి. మా కిరణ్‌గారి సపోర్ట్, గైడెన్స్‌ సినిమాకి చాలా ప్లస్‌ అయ్యింది. సినిమా తప్పకుండా హిట్‌ అవుతుందని ఆశిస్తున్నా. భవిష్యత్‌లో మా అక్కతో (మంజుల) సినిమా కూడా చేస్తానేమో?’’ అన్నారు.

‘‘మనసుకు నచ్చింది’ కథ రాయడం మొదలుకొని, సినిమా పూర్తి చేయడం వరకూ ఒక నేచురల్‌ ప్రాసెస్‌లా జరిగింది. మా నాన్నగారు (కృష్ణ), తమ్ముడు మహేశ్‌ గర్వపడేలా ఈ సినిమా ఉంటుంది. ఒకానొక సందర్భంలో మహేశ్‌ కొడుకు గౌతమ్‌ వెళ్లి  ‘నాన్నా.. మంజుల ఆంటీ సినిమాలో ఎప్పుడు యాక్ట్‌ చేస్తావ్‌?’ అని అడిగితే చాలా సింపుల్‌గా ‘అదే నా ఆఖరి సినిమా అవుతుంది’ అన్నాడట (నవ్వుతూ). కిరణ్‌గారి సహకారానికి రుణపడి ఉంటా’’ అన్నారు మంజుల. ‘‘మంజులగారి దర్శకత్వంలో హీరోగా చేయడం.. అది ఆమె ఫస్ట్‌ మూవీ కావడం నా లక్‌’’ అన్నారు సందీప్‌ కిషన్‌.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా