‘భరత్‌ అనే నేను’ సెకండ్‌ సింగిల్‌

10 May, 2018 12:13 IST|Sakshi
భరత్‌ అనే నేను సినిమాలో మహేష్‌ బాబు

సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం భరత్‌ అనే నేను. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాల స్పీడు పెంచారు చిత్రయూనిట్‌. ఇప్పటికే టైటిల్‌ సాంగ్‌ ను రిలీజ్ చేసిన చిత్రయూనిట్‌ ఈ రోజు (ఆదివారం) ఉదయం ఐ డోంట్‌ నో అంటూ సాగే మరో పాటను విడుదల చేశారు. దేవీ శ్రీ ప్రసాద్ స్వరాలందించిన ఈ పాటను బాలీవుడ్ స్టార్‌ ఫర్హాన్‌ అక్తర్‌ ఆలపించగా.. రామజోగయ్య శాస్త్రీ సాహిత్యమందించారు.

మహేష్ బాబు సరసన కైరా అద్వాని హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో శరత్‌కుమార్‌, ప్రకాష్ రాజ్‌, పోసాని కృష్ణమురళీ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలు విడిపోకముందు జరిగే కథగా రూపొందుతున్న ఈ సినిమాలో మహేష్ బాబు ముఖ్యమంత్రిగా కనిపిస్తున్నాడు. శ్రీమంతుడు లాంటి బ్లాక్‌ బస్టర్ హిట్ ఇచ్చిన మహేష్‌, కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా కావటంతో భరత్‌ అనే నేనుపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

మరిన్ని వార్తలు