మహేశ్‌ ఫ్యాన్స్‌కు ట్రిపుల్‌ ధమాకా

31 May, 2020 08:39 IST|Sakshi

హైదరాబాద్‌: టాలీవుడ్‌ సీనియర్‌ సూపర్‌స్టార్‌ కృష్ణ ఘట్టమనేని జన్మదినం నేడు. ఈ సందర్భంగా ఘట్టమనేని ఫ్యాన్స్‌, టాలీవుడ్‌ ప్రముఖులు సోషల్‌ మీడియా వేదికగా నటశేఖరుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ సందర్భంగా సూపర్‌స్టార్‌ మహేశ్‌ బాబు తన తండ్రికి బర్త్‌డే విషెస్‌ తెలుపుతూ ట్వీట్‌ చేశారు. ‘మీకు ఎప్పటికీ రుణపడే ఉంటాను. ఎప్పటికీ మీరే నా సూపర్‌ స్టార్‌. హ్యాపీ బర్త్‌డే నాన్న’ అంటూ ట్వీట్‌ చేశారు. అంతేకాకుండా తన తండ్రితో చిన్నప్పుడు దిగిన ఫోటోను కూడా అభిమానులతో పంచుకున్నారు మహేశ్‌. మహేశ్‌తో పాటు నమ్రతా శిరోద్కర్‌, సితారలు కూడా ఇన్‌స్టాలో​ కృష్ణకు ప్రత్యేక జన్మదిన శుభాకంక్షలు తెలిపారు. (మెరిట్‌ స్టూడెంట్‌)

ఫ్యాన్స్‌తో సూపర్‌స్టార్‌ ముచ్చట
తన తండ్రి కృష్ణ బర్త్‌డే సందర్భంగా మహేశ్‌ ఈ రోజు సాయంత్రం సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటించనున్నారు. ఈ సందర్భంగా ఇన్‌స్టాలో సాయంత్రం 5 గంటలకు క్వశ్చన్‌ అండ్‌ ఆన్సర్‌ సెషన్‌లో పాల్గొంటారు. అంతేకాకుండా ఈ లైవ్‌ చాట్‌లో తన సినిమాలు, కుటుంబం గురించి ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక కృష్ణ బర్త్‌డే రోజే మహేశ్‌ 27వ చిత్రం ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. దీంతో ఈరోజు మహేశ్ ఫ్యాన్స్‌కు పండగే పండగ అని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇక మహేశ్‌ తదుపరి చిత్రాన్ని పరుశురాం దర్శకత్వం వహిస్తుండగా మైత్రీమూవీమేకర్స్‌ నిర్మించబోతోంది. జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, 14 రీల్స్‌ సంస్థలు కూడా ఈ చిత్ర నిర్మాణంలో భాగస్వామ్యం వహిస్తాయి. (సోనూసూద్‌పై సీఎం ప్రశంసల జల్లు)

Happy birthday, Thatha garu🥳🎉🎂 I love you very much... ❤️Hope you have a wonderful day 🤗

A post shared by SitaraGhattamaneni (@sitaraghattamaneni) on

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు