మరోసారి వంద కోట్ల క్లబ్లో..?

4 May, 2016 13:08 IST|Sakshi
మరోసారి వంద కోట్ల క్లబ్లో..?

రీజినల్ సినిమాకు వంద కోట్ల కలెక్షన్లు కల అనుకుంటున్న సమయంలో సూపర్ స్టార్ మహేష్ బాబు మాత్రం ఆ ఫీట్ను రెండో సారి సాధించడానికి రెడీ అవుతున్నాడు. ఇప్పటికే శ్రీమంతుడు సినిమాతో బాహుబలి సినిమా తరువాత వంద కోట్ల వసూళ్లు సాధించిన టాలీవుడ్ హీరోగా రికార్డ్ సృష్టించిన మహేష్, ఈ సారి తన సినిమా రిలీజ్కు ముందు ఆ ఫీట్ను రిపీట్ చేస్తున్నాడు.

ప్రస్తుతం శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో బ్రహ్మోత్సవం సినిమాలో నటిస్తున్న మహేష్, ఈ నెలాఖరున ఆ సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. భారీ బడ్జెట్తో కలర్ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్లో సరికొత్త రికార్డ్లు సృష్టిస్తోంది. ఇప్పటికే మహేష్ బ్రహ్మోత్సవం వంద కోట్ల బిజినెస్ చేసేసిందన్న టాక్ వినిపిస్తోంది.

బ్రహ్మోత్సవం సినిమా వంద కోట్ల బిజినెస్ చేసేసిందంటూ లెక్కలు కూడా చెప్పేస్తున్నారు మహేష్ ఫ్యాన్స్. రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి 50 కోట్లు, కర్ణాటక, తమిళనాడులతో పాటు ఇతర రాష్ట్రాలకు 19 కోట్లు, ఆడియో, శాటిలైట్ రైట్స్ కు గాను 20 కోట్లు, ఓవర్ సీస్ రైట్స్ లో 13 కోట్లు ఇలా వంద కోట్లకు పైగా ఈ సినిమా బిజినెస్ చేసిందని లెక్కలు వేస్తున్నారు. నిజంగానే ఈ స్ధాయిలో బిజినెస్ చేస్తే..,బ్రహ్మోత్సవం అంతకు మించి కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. మరి మహేష్ ఈ సారి తన రికార్డ్ తానే బద్దలు కొడతాడేమో చూడాలి.