అనిల్‌కు కంగ్రాట్స్‌: మహేశ్‌బాబు

5 Jan, 2020 10:24 IST|Sakshi

అనిల్‌ రావిపూడి.. పటాస్‌, సుప్రీమ్‌, రాజా ది గ్రేట్‌, ఎఫ్‌2 ఎన్నో హిట్‌ సినిమాలను అందించిన దర్శకుడు. అతని సినిమా వస్తుందంటే చాలు ఒక్కసారైనా చూడాల్సిందే అనుకునే అభిమానులు చాలామందే ఉన్నారు. ఓటమి చవిచూడని దర్శకుడిగా అనిల్‌ రావిపూడికి టాలీవుడ్‌లో ముద్ర పడిపోయింది. వినూత్న కామెడీతో థియేటర్‌కు వచ్చే ప్రేక్షకుడిని కడుపుబ్బా నవ్వించే శక్తి అనిల్‌ రావిపూడి సొంతం. గతేడాది ఎఫ్‌2తో బాక్సాఫీస్‌ దగ్గర నవ్వులు కురిపించన అనిల్‌ ప్రస్తుతం సరిలేరు నీకెవ్వరు సినిమాకు పనిచేస్తున్నారు.

అనిల్‌ రావిపూడికి ఆదివారం ఉదయం కుమారుడు జన్మించాడు. దీంతో అనిల్‌ ఇంట్లో సంక్రాంతి పండగ ముందుగానే వచ్చినట్టయింది. కాగా అనిల్‌ రావిపూడి, భావనల జంటకు శ్రేయాస్వి అనే కూతురు ఉంది. కూతురుతో ఆడుకోడానికి మరో బుడతడు వచ్చేయడంతో ఆ ఇంట్లో సంతోషం నెలకొంది. ఈ సందర్భంగా సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు అనిల్‌ రావిపూడికి అభినందనలు తెలిపాడు. అనిల్‌ రావిపూడి ఇంట్లో చిన్న అనిల్‌ జన్మించడంతో పలువురు సినీప్రముఖులు అనిల్‌కు కంగ్రాట్స్‌ తెలియజేస్తున్నారు.

కాగా అనిల్‌ రావిపూడి ప్రస్తుతం సరిలేరు నీకెవ్వరు చిత్రానికి పనిచేస్తున్నారు. ఈ సినిమాలో మహేశ్‌ను మాస్‌ యాంగిల్స్‌లో చూస్తారని, అభిమానులు తప్పకుండా ఆదరిస్తారని ధీమా వ్యక్తం చేశాడు. అయితే ఈ చిత్రంలో మాస్‌తో పాటు కావాల్సినంత కామెడీ కూడా ఉంటుందని ఆయన పేర్కొన్నాడు. ఈ చిత్రంలో మహేశ్‌ సరసన రష్మిక మందన్నా నటించారు. దేవీ శ్రీ ప్రసాద్‌ సంగీతం అందించిన ఈ చిత్రం జనవరి 11న విడుదల కానున్న విషయం తెలిసిందే.

It’s a baby boy for my director @AnilRavipudi!! 😍😍😍 Congratulations to the proud parents...Loads of love & blessing to the lil one. Shine on brother 🤗🤗🤗

చదవండి: పండక్కి మరో పండగలా మా సినిమా ఉంటుంది

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా