కొండారెడ్డి బురుజు @ నాలుగున్నర కోట్లు

24 Sep, 2019 00:24 IST|Sakshi
కొండారెడ్డి బురుజు లొకేషన్‌లో మహేశ్‌

సరిగ్గా పదహారేళ్ల క్రితం కర్నూలు కొండారెడ్డి బురుజు సెంటర్‌ దగ్గర కర్నూలు ఫేమస్‌ రౌడీ అయిన ఓబుల్‌ రెడ్డిని కొట్టి, స్వప్నను తన దగ్గర నుంచి తీసుకెళ్తాడు అజయ్‌. ‘ఒక్కడు’ సినిమాలో యాక్షన్‌ సన్నివేశం ఇది.  తెలుగు సినిమాల్లో ఉత్కంఠకు గురి చేసే సన్నివేశాల్లో ఈ సీన్‌ కచ్చితంగా ఉంటుంది. 16 ఏళ్ల తర్వాత మళ్లీ కొండారెడ్డి బురుజు దగ్గర మహేశ్‌బాబు సినిమా షూటింగ్‌ జరుగుతోంది. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో మహేశ్‌బాబు హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’.

అనిల్‌ సుంకర, ‘దిల్‌’ రాజు నిర్మాతలు. రష్మికా మందన్నా కథానాయిక. ఈ సినిమా కోసం కర్నూల్‌ కొండారెడ్డి బురుజు సెట్‌ను హైదరాబాద్‌లో వేసిన సంగతి తెలిసిందే. ఈ సెట్‌ను నిర్మించడానికి సుమారు నాలుగున్నర కోట్లు ఖర్చయిందని సమాచారం. ఆర్ట్‌ డైరెక్టర్‌ ఏయస్‌ ప్రకాశ్‌ ఆధ్వర్యంలో సెట్‌ రూపకల్పన జరిగింది. ‘‘పదహారేళ్ల క్రితం ఈ లొకేషన్‌ (‘ఒక్కడు’ కర్నూల్‌ సీన్స్‌ని ఉద్దేశించి)  సిల్వర్‌ స్క్రీన్‌ మీద ఐకానిక్‌ అయింది. ఈసారి దాన్ని మించేలా చేయడానికి ప్రయత్నిస్తున్నాం’’ అని అనిల్‌ రావిపూడి ట్వీట్‌ చేశారు.
 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు