అచ్చం నాన్నలానే!

31 Aug, 2017 01:13 IST|Sakshi
అచ్చం నాన్నలానే!

ఫొటోలు చూశారా? అప్పట్లో కృష్ణ... ఇప్పుడు మహేశ్‌బాబు! వాళ్ల సిట్టింగ్‌ స్టైల్‌ అబ్జర్వ్‌ చేశారా? సేమ్‌ టు సేమ్‌ ఒకలానే ఉంది కదూ! కాలు మీద కాలేసుకోవడమయితే డిటో అసలు. కృష్ణ దిగిన బ్లాక్‌ అండ్‌ వైట్‌ ఫొటో ఎప్పటిదో తెలీదు గానీ... మహేశ్‌ది మాత్రం ఇప్పటిదే. రొమేనియాలో ‘స్పైడర్‌’ చివరి పాట చిత్రీకరణలో, విరామ సమయంలో సినిమాటోగ్రాఫర్‌ సంతోష్‌ శివన్‌ తీసిన ఫోటో ఇది.

‘‘అప్పుడు.. మా లెజండరీ మావయ్యగారు అండ్‌ ఇప్పుడు ఆయన సొగసరి కుమారుడు’’ అని ఈ రెండు ఫొటోలను ఉద్దేశించి మహేశ్‌ భార్య నమ్రత ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. అలాగే మహేశ్‌ సోలో ఫొటోపై ‘‘మహేశ్‌ విత్‌ హిజ్‌ ఫ్యాన్‌’’ అని మహేశ్‌ ఎదురుగా ఉన్న ఫ్యాన్‌ని ఉద్దేశించి, ఆమె చిన్న జోక్‌ కూడా వేశారండోయ్‌!