టాక్‌ఆఫ్‌ ది టాలీవుడ్‌గా 81 అడుగుల కటౌట్‌

26 Nov, 2019 12:57 IST|Sakshi

హైదరాబాద్‌: సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు అనిల్ రావిపూడిల కలయికలో తెరకెక్కుతున్న సరిలేరు నీకెవ్వరు సినిమా నుండి మొన్న రిలీజ్ అయిన టీజర్ తరువాత సినిమాపై విపరీతమైన అంచనాలు ఏర్పడ్డాయి. మహేష్ బాబు ఆర్మీ ఆఫీసర్‌గా నటిస్తోన్న ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో తాజాగా విడుదలైన టీజర్ వ్యూస్‌, ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సుద‌ర్శన్ 35 ఎంఎం థియేటర్ వద్ద దర్శనమిస్తున్న మహేశ్ బాబు భారీ కటౌటే నిదర్శనం.

హైదరాబాద్‌లోని మహేష్ బాబు అడ్డాగా పేరుగాంచిన సుదర్శన్ 35 ఎంఎం థియేటర్ వద్ద సూపర్ స్టార్ మహేష్ బాబు 81 అడుగుల కటౌట్‌ని థియేటర్ యాజమాన్యం ఏర్పాటు చేసింది. ఈ కటౌట్‌ ప్రస్తుతం టాక్‌ఆఫ్‌ ది టాలీవుడ్‌గా మారిందని చెప్పొచ్చు. సాధారణంగా సినిమా విడుదలకు ముందు థియేటర్ల వద్ద కటౌట్‌లు పెట్టడం జరుగుతుంది. కానీ సంక్రాంతికి విడుదలయ్యే సినిమా కోసం ఇప్పుడే కటౌట్‌ పెట్టేయడంతో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

భార్య, పిల్లలు విదేశాల్లో చిక్కుకుపోయారు: విష్ణు

ఈ పాటను చేతులు కడుక్కొని వినండి!

ఇంటి ప‌ని చేస్తూ ఏడ్చేసిన‌ న‌టి

‘దారుణం, అత‌డి ప్ర‌తిభ‌ను కొట్టేశారు’

న‌యా ట్రెండ్ సృష్టిస్తోన్న ‘ఆహా’

సినిమా

భార్య, పిల్లలు విదేశాల్లో చిక్కుకుపోయారు: విష్ణు

ఈ పాటను చేతులు కడుక్కొని వినండి!

ఇంటి ప‌ని చేస్తూ ఏడ్చేసిన‌ న‌టి

‘దారుణం, అత‌డి ప్ర‌తిభ‌ను కొట్టేశారు’

న‌యా ట్రెండ్ సృష్టిస్తోన్న ‘ఆహా’

సింగ‌ర్‌కు ఐదోసారీ క‌రోనా పాజిటివ్‌