లుక్‌ టెస్ట్‌ చేయగానే ధైర్యం వచ్చింది

5 Mar, 2019 01:45 IST|Sakshi
ఆదిసాయికుమార్, మహేశ్‌బాబు, అడివి సాయికిరణ్, సాయికుమార్‌

– ఆదిసాయికుమార్‌

‘‘భారతీయ తెరపై ఇప్పటివరకు ఎవరూ టచ్‌ చేయని కథతో ఈ సినిమా చేశాం. ఈ సినిమాని క్రాస్‌ జోనర్‌ పద్ధతిలో తీశాం. యాక్షన్, రొమాన్స్, కామెడీ అంశాలతో సినిమా ఉంటుంది. ఇందులో ఎన్‌ఎస్‌జీ కమాండో పాత్రకు ఆది సాయికుమార్‌ పర్ఫెక్ట్‌ అనిపించింది. అయితే ఆ పాత్రకు డ్యాన్సులు ఉండవు. అందుకని చేస్తాడో లేదో అనుకున్నాను. కానీ కథ విని నటుడిగా తనకు చాలా కొత్తగా ఉంటుందని చేయడానికి అంగీకరించాడు’’ అన్నారు అడివి సాయికిరణ్‌. ‘వినాయకుడు, విలేజ్‌లో వినాయకుడు, కేరింత’ విజయాల తర్వాత  అడివి సాయికిరణ్‌ దర్శకత్వం వహించిన చిత్రం ‘ఆపరేషన్‌ గోల్డ్‌ఫిష్‌’.

ఆదిసాయికుమార్, అబ్బూరి రవి, సషా ఛెట్రి, కార్తిక్‌రాజు, నిత్యానరేష్, పార్వతీశం ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ప్రతిభా అడివి, కట్టా ఆశిష్‌రెడ్డి, కేశవ్‌ ఉమా స్వరూప్, పద్మనాభరెడ్డి, గ్యారీ బీహెచ్, సతీష్‌ డేగలతో పాటు ఈ చిత్రనటీనటులు, సాంకేతిక నిపుణులు నిర్మించారు. ఈ చిత్రం టీజర్‌ను మహేష్‌బాబు విడుదల చేశారు. ఈ సందర్భంగా సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆది సాయికుమార్‌ మాట్లాడుతూ – ‘‘లవర్‌బాయ్‌ పాత్రలు చేసిన నాకు ఎన్‌ఎస్‌జీ కమాండో లుక్‌ సెట్‌ అవుతుందో లేదో అనిపించింది.

నాన్న కథ విని నాకీ పాత్ర బాగుంటుందని చెప్పారు. లుక్‌ టెస్ట్‌ చేయగానే ధైర్యం వచ్చింది. నా పాత్రకు హీరోయి¯Œ , పాటలు ఏవీ ఉండవు. కశ్మీర్‌ పండిట్‌ కుటుంబంలో పుట్టిన కుర్రాడిగా కనిపిస్తాను. 1980 నాటి కాలంలో కశ్మీర్‌ పండిట్‌ కుటుంబాలకు జరిగిన అన్యాయాన్ని చర్చిస్తూ ఈ సినిమా చేశాం. ఇటీవల అలాంటి ఘటనలే మళ్లీ కశ్మీర్‌లో జరగడం బాధను కలిగించింది’’ అని అన్నారు. ‘‘కేరింత’ సినిమాతో దర్శకుడు సాయికిరణ్‌ నన్ను పరిచయం చేశారు. ఈ సినిమాలో మంచి పాత్ర ఇచ్చారు’’ అన్నారు నిత్యా నరేష్‌. నిర్మాతల్లో ఒకరైన పద్మనాభరెడ్డి మాట్లాడుతూ – ‘‘కెమెరామేన్‌ జైపాల్‌రెడ్డి ద్వారా నాకు సాయికిరణ్‌ అడివి పరిచయం అయ్యారు.

నిర్మాతను కూడా సాంకేతిక నిపుణుడిగా భావించి ఈ సినిమా చేశారు. వంద శాతం విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. ‘‘ఇంటె¯Œ ్స ఎమోషనల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ చిత్రమిది. నాలుగు పాటలుంటాయి. క్షణం, గరుడవేగ, గూఢచారి తర్వాత నాకు మంచి పేరు తెచ్చిపెడుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు సంగీత దర్శకుడు శ్రీచరణ్‌ పాకాల. అబ్బూరి రవి మాట్లాడుతూ – ‘‘ఈ కథ విని నోట మాట రాలేదు. సాయికిరణ్‌ ఇలాంటి సినిమా చేస్తారని ఊహించలేదు. హైదరాబాద్‌లో స్థిరపడిన కశ్మీర్‌ పండిట్‌ కుటుంబాల్ని కలుసుకొని వారి బాధలను స్వయంగా తెలుసుకొని సాయికిరణ్‌ ఈ కథను రాసుకున్నారు’’ అన్నారు. కార్తీక్‌రాజు, పార్వతీశం తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి కో–ప్రొడ్యూసర్‌: దాయోధర్‌ యాదవ్, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: కిరణ్‌రెడ్డి తుమ్మ.

మరిన్ని వార్తలు